Pomegranate Flowers : ఔషధంగా పనిచేసే దానిమ్మ పువ్వులు!
దానిమ్మ పండుతోపాటు పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకునే వారు దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారై ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు.

Pomegranate Flowers
Pomegranate Flowers : రుచితో పాటు ఆరోగ్యానికి దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. దానిమ్మలో మిటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ,పోటాషియం ,ఫైబర్ మరియు కేన్సర్ వ్యాధిని నిరోధించే ఆసిడ్స్ ఉన్నాయి. ధనిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సీన్ లను బయటికీ పంపవచ్చు. శరీరంలోని కొలెస్ట్రాలని నియంత్రిస్తుంది.దీనిని తరుచు తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు.
దానిమ్మ పండుతోపాటు పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకునే వారు దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారై ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు. అంతేకాకుండా దానిమ్మ పువ్వును మెత్తగా చేసి అలర్జీలు, కిటకాలు కుట్టిన ప్రదేశంలో రాయటంవల్ల పొక్కులు మానిపోతాయి.
రుతువిరతి సమయంలో స్త్రీలు మానసికంగా భావోద్వేగానికి గురై చేతులు, కాళ్లు, తుంటి కీళ్ల నొప్పులకు గురవుతారు. అలాంటి సమయంలో దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే ఫలితం వుంటుంది. పువ్వును చూర్ణం చేసి రసాన్ని పిండుకుని ఒక ఔన్సు రసం తీసుకోవాలి. అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. నీళ్ల విరేచనాలు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగిస్తారు.సహజ యాస్పిరిన్‌గా పనిచేసి రక్తసరఫరాను వేగవంతం చేస్తుంది. కొందరికి కడుపులో గ్యాస్ ఇరిటేషన్ వల్ల కొద్దిగా తింటే కడుపు నిండిపోయి ఆకలిగా అనిపించదు. అలాంటి సమస్య ఉన్నవారు దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే చికాకు తగ్గుతుంది.