Micronutrient Deficiencies : సూక్ష్మపోషక లోపాలు.. సంకేతాలు, కారణాలు

సూక్ష్మపోషక లోపాలు చాలా సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో, రోజువారీ ఆహారం ద్వారా సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తారు. అయితే స్త్రీల విషయంలో రోజువారిగా అవసరమైన మోతాదులో శరీరానికి కావాల్సి పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది.

Micronutrient Deficiencies : సూక్ష్మపోషక లోపాలు.. సంకేతాలు, కారణాలు

Micronutrient Deficiencies

Updated On : May 27, 2023 / 12:12 PM IST

Micronutrient Deficiencies : సూక్ష్మపోషకాలు మన శరీరానికి చాలా తక్కువ మొత్తంలో అవసరమైన విటమిన్లు , ఖనిజాలు. అయితే ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం ఏర్పడితే తీవ్రమైన, ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

READ ALSO : Important Nutrients : 40 ఏళ్ల తర్వాత ప్రతి స్త్రీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన పోషకాలు !

సూక్ష్మపోషక లోపాలు చాలా సాధారణం, ముఖ్యంగా స్త్రీలలో, రోజువారీ ఆహారం ద్వారా సూక్ష్మపోషకాల అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తారు. అయితే స్త్రీల విషయంలో రోజువారిగా అవసరమైన మోతాదులో శరీరానికి కావాల్సి పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి, బి12 మరియు ఎ, అలాగే ఐరన్ , కాల్షియం వంటి కొన్ని సాధారణ పోషక లోపాలు శరీరరపరమైన ఇబ్బదులకు దారితీస్తాయి.

సూక్ష్మపోషక లోపం.. సంకేతాలు ;

సూక్ష్మపోషకాలు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిలోపం ఏర్పడితే దీనిని తెలుసుకునేందుకు కొన్ని మధ్యస్థ లక్షణాలు కనిపిస్తాయి. అలసట భావన, బలహీనత, శక్తి లేకపోవడం, సమన్వయం లేకపోవడం, ఎదో ఒక జబ్బుతో బాధపడుతుండటం, అన్ని వేళలా జబ్బు, వ్యాధులు చుట్టుముట్టటం, మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస ఆడకపోవడం, రక్తహీనత, ఎముకల్లో పటుత్వం లేకపోవటం, జుట్టు రాలడం, అంధత్వం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : Aloe Vera for Your Hair : జుట్టుకు పోషకాలు అందించటంతోపాటు, హెయిర్ ఫాల్ తగ్గేందుకు కలబంద బెస్ట్!

గర్భధారణ సమయంలో సూక్ష్మపోషక లోపాలు పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపిస్తాయి. గర్భిణీ స్త్రీలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నట్లయితే వెన్నుపాము లోపాలు వంటి తీవ్రమైన లోపాలను కలిగి ఉన్న బిడ్డను జన్మనిస్తారు.

సూక్ష్మపోషక లోపం.. చికిత్స ;

సూక్ష్మపోషకాల లోపాన్ని నివారించటానికి విభిన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాత్రి భోజనానికి అన్నం కాకుండా మాంసం, బీన్స్, మరియు కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కేలరీలు మాత్రమే కాకుండా ప్రోటీన్ , సూక్ష్మపోషకాల అవసరాలను సులభంగా తీరుస్తుంది. పోషకాహారాన్ని మెరుగుపరచడానికి సప్లిమెంట్‌లు, ఆహార పదార్థాల తయారీలో మార్పులు, బలవర్థకమైన బయోఫోర్టిఫికేషన్ తదితరాలు ఉన్నాయి.

READ ALSO : ఆ గింజలను నానబెట్టుకుని తింటే బరువు తగ్గటంతోపాటు శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయ్!

శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుకోవడానికి ;

1. పెరటి తోటలు: గృహాలు, పాఠశాలలు ఇతర ప్రదేశాలలో పోషకాలు అధికంగా ఉండే పండ్లు , కూరగాయల తోటలు సూక్ష్మపోషకాల లోపాన్ని తగ్గించడానికి, ప్రజలు పేదరికం నుండి బయటపడటానికి అద్భుతమైన మార్గాలుగా చెప్పవచ్చు.

2. సప్లిమెంట్స్: సూక్ష్మపోషక లోపాన్ని తగ్గించే ప్రయత్నాలలో ఉన్నవారికి సప్లిమెంటేషన్ అనేది ప్రాథమిక పద్ధతి. రోజువారీ విటమిన్లు ఆహార రూపంలో తీసుకోవటం వివిధ కారణాల వల్ల అసాధ్యం. అలాంటివారికి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి.

READ ALSO : మెదడు పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా చేర్చుకోండి!

3. సూక్ష్మపోషక శోషణ ; కొన్ని ఆహార పదార్థాల తయారీ పద్ధతులు పోషకాలను సులభంగా జీర్ణం చేస్తాయి. ఇతర తయారీ పద్ధతులు పోషకాలను నాశనం చేస్తాయి. ఉదాహరణకు కొన్ని ఆహారాలను నూనెలో వేయించటం వల్ల అందులోని పోషకాలు తొలగిపోతాయి. అలాగే మరికొన్నింటిని ఉడికించటం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇలా ఒక్కో ఆహారం విషయంలో ఒక్కో విధంగా ఉంటుంది.

5. బయోఫోర్టిఫికేషన్ ; ఆహారాలకు పోషకాలను జోడించే బదులు, ప్రధానమైన పంటలలో లభించే పోషకాలను బట్టి ఆపంటలను ఎంపిక చేసి బయోటెక్నాలజీతో నేరుగా మెరుగుపరచవచ్చు.

ఇంట్లో ఆహారాన్ని తయారు చేసే విధానంలో మార్పులు చేయటంతోపాటు, సక్ష్మపోషకాల లోపం లేకుండా మనంతీసుకునే ఆహారంలో మార్పులు చేసినట్లైతే మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.