Migraine : పిల్లలను వేధించే మైగ్రేన్!

మెదడు, మెదడు వెలుపలి సమస్యలతో సంబంధం లేని తలనొప్పిగా పార్శ్వనొప్పిని చెప్పవచ్చు. సాధారణంగా ఇది సాయంత్రం వేళలో వస్తుంటుంది. ఎక్కువసేపు ఎండకు గురికావటం, సమయానికి తినకపోవటం, పడుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వంటివాటి వల్ల వస్తుంది. కొందరిలో చాక్లెట్లు ఎక్కువగా తినటంతోనూ వస్తుంది.

Migraine : పిల్లలను వేధించే మైగ్రేన్!

Negative impact on children's mental health

Updated On : July 31, 2022 / 4:00 PM IST

Migraine : పిల్లల్లో తలనొప్పి మామూలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలమూ వేధించొచ్చు. అలసట,ఆకలి,ఒత్తిడి, ఆందోళన, రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండటం, జలుబు చేయటం వంటి పరిస్ధితుల్లో తలనొప్పి సహజంగానే వస్తుంది. తలనొప్పి ఏ వయసువారికైనా రావొచ్చు. దీనికి పిల్లలు మినహాయింపేమీ కాదు. నాడీ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే పిల్లల్లో తలనొప్పితో బాధపడేవారు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. యుక్త వయసు వారిలో ఈసమస్య ఎక్కువగానూ కనిపిస్తుంది. పిల్లలు సమస్యగురించి స్పష్టంగా చెప్పలేకపోవటం, పెద్దవాళ్లు అంతగా పట్టించుకోనందువల్ల చాలాసార్లు తలనొప్పి దానంతటదే తగ్గుతుండటం వల్ల అదొక సమస్య కాదనే భావిస్తుంటారు. తలనొప్పికి సంబంధించి పిల్లలను ఎక్కువగా వేధించే సమస్య పార్శ్యపు నొప్పి.

మెదడు, మెదడు వెలుపలి సమస్యలతో సంబంధం లేని తలనొప్పిగా పార్శ్వనొప్పిని చెప్పవచ్చు. సాధారణంగా ఇది సాయంత్రం వేళలో వస్తుంటుంది. ఎక్కువసేపు ఎండకు గురికావటం, సమయానికి తినకపోవటం, పడుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వంటివాటి వల్ల వస్తుంది. కొందరిలో చాక్లెట్లు ఎక్కువగా తినటంతోనూ వస్తుంది. అందుకే పార్శ్వనొప్పి రాబోతోందని కొందరు పిల్లలు గుర్తించగలరు కూడా. చాలావరకు తలకు ఒకవైపునే నొప్పి ఉంటుంది. సాధారణంగా కళ్ల మీద, కంటి వెనకాల నొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువసేపు ఉంటుంది. కళ్లచుట్టూ మిరుమిట్లు గొలిపే కాంతులు కనిపించొచ్చు. ఒకవైపు చూపు మసకబారటం, వికారం వంటివీ ఉంటాయి. నొప్పి వచ్చినప్పుడు పిల్లలు పడుకోవాలని చూస్తుంటారు. ఏమాత్రం చప్పుడు, వెలుతురు భరించలేరు. పార్శ్వనొప్పి కొందరికి నెలకు ఒకసారి రావొచ్చు. కొందరికి రెండు, మూడు నెలలకు ఒకసారి రావొచ్చు. కొందరికి నెలలోనే చాలాసార్లు రావొచ్చు. తల్లిదండ్రులకు పార్శ్వనొప్పి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ.

నాడీ సమస్యలు, అధిక రక్తపోటు, చూపు సమస్యలు, ముక్కుచుట్టూరా ఉండే గాలి గదుల్లో వాపు , పిప్పి పళ్లు సమస్యలూ తలనొప్పికి దారితీయొచ్చు. దీన్ని పిల్లలు తలనొప్పి అనే అనుకుంటారు. పార్శ్వనొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిని చికిత్స అందించటం మంచిది.