Mustard Oil : చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పెంచే ఆవనూనె మసాజ్! ఈ నూనెతో ఇంకా అనేక ప్రయోజనాలు
ఆవనూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

Mustard oil massage to increase body temperature in winter! There are many more benefits with this oil
Mustard Oil : ఆవనూనె ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటుగా అనేక ఔషదగుణాలు ఉన్నాయి. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ఆవనూనె మెటబాలిజన్ని వేగవంతం చేసి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఫ్యాట్ కణాలు నిల్వ చేరకుండా చేస్తుంది. ఆవాల నూనెను ఆస్త్మా నివారణ కోసం ఉపయోగిస్తారు. సైనసైటిస్ తో బాధపడే వారు ఆవనూనెను ఉపయోగించడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆవనూనెను ఉదరం, చాతీకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శ్వాసనాళాల్లో సడలింపు వస్తుంది.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవనూనెతో బాడీ మసాజ్ చేస్తే. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఆవనూనెలో బాడీ టెంపరేచర్ ను పెంచే గుణాలుంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఆవనూనెతో బాగా మసాజ్ చేస్తే శరీరంలో వేడిపుడుతుంది. తద్వారా చలిని తట్టుకోవచ్చు.
కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి కూడా ఆవనూనె ఉపయోగపడుతుంది. ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్రమం తప్పకుండా ఆవనూనెతో ఎముకలు, కండరాలు, కీళ్లకు బాగా మసాజ్ చేస్తే ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో రక్తం, పోషణ శరీరంలోని ఇతర అవయవాలకు బాగా చేరుతాయి.
ఆవనూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. రెగ్యులర్ గా ఆవనూనె ఆహారంలో చేర్చుకోవటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఊబకాయం సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి నిద్రబాగా పడుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. నూనె వాడకం వల్ల హైపర్ థైరాయిడ్ రాకుండా ఉంటుంది. ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తొలిగించడానికి మస్టర్డ్ ఆయిల్‌ను రాసుకుంటే మంచిది.