Increase Appetite : ఆకలిని పెంచే సహజసిద్ధ గృహ ఔషధ చిట్కాలు

ఆకలిని పెంచుకునేందుకు చాలా మంది మందులపై అధారపడతారు. అయితే అలాంటి అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకరంగా ఆకలిని పెంచుకోవచ్చు

Increase Appetite : ఆకలిని పెంచే సహజసిద్ధ గృహ ఔషధ చిట్కాలు

Increase Appetite

Updated On : April 7, 2022 / 12:31 PM IST

Increase Appetite :  ఆకలి అనేది మనిషి ఆరోగ్యానికి ఒక సంకేతంగా చెప్పవచ్చు. ఆకలి బాగా పెరిగినా, బాగా తగ్గినా ఇదొక అనారోగ్యానికి సంకేతంగా చెబుతుంటారు. కొంతమందిలో ఆకలిస్ధాయి చాలా తక్కువగా ఉంటుంది. ఏది కూడా తినాలని పించదు. ఇలాంటి వారిలో ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కారణంగా కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆకలి తగ్గితే త్వరగా బరువు కోల్పోతారు. ఆకలి తగ్గటాన్ని అనోరేక్సియా అంటారు. దీనిని సహజ ఔషదాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. ఆకలిని పెంచుకునేందుకు చాలా మంది మందులపై అధారపడతారు. అయితే అలాంటి అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకరంగా ఆకలిని పెంచుకోవచ్చు. వాటి గురించిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. అల్లం ; ఆకలిని పెంచే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదాలలో అల్లం ఒకటి. ఈ ఔషదం అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అల్లం తినటం వలన లేదా ఆహారంలో వాడటం వలన ఆకలి పెరుగుతుంది. రోజులో 3-4 సార్లు అల్లం టీ తాగటం వలన లాలాజలం శక్తివంతంగా మారుతుంది. జీర్ణక్రియ రసాలు ఉత్పత్తి అధికమమై, ఆకలి కూడా మెరుగుపడుతుంది.

2. నిమ్మ; నిమ్మరసం, ఆకలిని ఎంతగానో పెంచుతుంది. నిమ్మకాయ నుండి రసాన్ని పిండి లేదా సలాడ్’లలో కలిపుకొని తినటం వలన ఆకలి పెరుగుతుంది. రోజులో రెండు సార్లు రెండు గ్లాసుల నిమ్మరసం తాగటం వలన ఆకలి పెరుగుతుంది.

3. ఉసిరి ; ఇండియన్ గూస్పెర్రీ గా దీనిని పిలుస్తారు. ఆకలిని పెంచే సహజ ఔషదంగా పని చేస్తుంది. ఉసిరి, జీర్ణక్రియ వ్యవస్థ యొక్క పని తీరును, కాలేయాన్ని నిర్విషీకరణకు గురిచేసి ఆకలిని పెంచుతుంది. తేనె, ఉసిరి కలిపి లేదా ఉసిరితో తయారు చేసిన ఉరగాయను తినటం వల్ల సహజసిద్ధంగానే ఆకలిని పెంచుకోవచ్చు.

4. నల్ల మిరియాలు ; నల్ల మిరియాలను జీర్ణక్రియ శక్తిని పెంచే ఔషదంగా వాడతారు అని తెలిసిందే. రుచి గ్రాహకాలను ఉత్తేజపరచి, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను వేగవంతం చేయటం వలన, ఆకలిని పెరుగుతుంది.

5 దానిమ్మ పండు రసం ; ఆకలిని పెంచే ఇంట్లో ఉండే ఔషదాలను తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తే, దానిమ్మ పండు రసాన్ని తీసుకోండి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్’లను కలిగి ఉన్న దానిమ్మ పండు రసం జీర్ణక్రియ శక్తి ప్రేరేపించటమే కాకుండా, ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది.

6. చింతపండు ; ఆకలిని పెంచే ఉత్ప్రేరకాలలో చింతపండు ఒకటి. దీని గుజ్జును ఇంట్లో వంటలలో వాడుతుంటారు. భారతదేశంలో చాలా రకాల వంటకాలలో మంచి రుచిని ఆపాదించటానికి చింతపండును వాడుతుంటారు. రోజు తయారు చేసుకునే వంటకాలలో ఎక్కువ మొత్తంలో కలపుకోవటం వలన మీ ఆకలి పెరుగుతుంది. అయితే తగిన మోతాదులోనే దీనిని వాడుకోవాలి.

7. కొత్తిమీర ; కొత్తిమీర, జీర్ణక్రియ ఎంజైమ్’ల ఉత్పత్తిని అధికం చేసి, సహజ సిద్దంగా ఆకలిని పెంచుతుంది. రోజు ఉదయాన, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కొత్తిమీర రసాన్ని తాగటం వలన ఆకలి సులువుగా పెరుగుతుంది.

8. ఖర్జూరా ; ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. ఖర్జూర రసం తాగినా ఆకలిపుడుతుంది. ఆరోగ్యానికి ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది.

9. యాలుకలు ; జీర్ణ ర‌సాల‌ను ఉత్పత్తి చేయ‌డ‌మే కాక, ఆక‌లి బాగా అయ్యేలా చేస్తాయి. రోజూ ఉద‌యం మ‌రియు సాయంత్రం స‌మ‌యంలో భోజ‌నానికి మందు ఒక‌టి లేదా మూడు యాల‌కుల‌ను అలాగే న‌మిలి మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న ఆక‌లి బాగా అవుతుంది.

ఒకవేళ ఈ సమస్య చాలా రోజులుగా ఆకలి సమస్య కొనసాగుతుంటే మాత్రం శరీరంలో ఇతరత్రా సమస్యలు ఉన్నట్లు భావించి వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఏమాత్రం అశ్రద్ధ చూపినట్లయితే, ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.