White Hair : సహజపద్దతిలో తెల్లజుట్టు… నల్లగా….
దీంతో పాటు షాంపూలు, కండీషనర్లు మానేసి సహజసిద్ధంగా లభించే శీకాయ, కుంకుడు కాయను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది.

Wight Hair
White Hair : జుట్టు తెల్లబడిపోతుందని చాలా మంది నిత్యం మదన పడుతుంటారు. తెల్లజుట్టుతో బయట తిరగలేక పోతుంటారు. జుట్టు నల్లగా మార్చుకునేందుకు అనేక రసాయనాలతో కూడిన కలర్స్ ను జుట్టుకు వేస్తుంటారు. దీని వల్ల అలర్జీలతోపాటు, చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ఉద్యోగం, ఇంటి విషయాల్లో ఒత్తిళ్లు ,టెన్షన్, కారణంగా తక్కువ వయస్సుకే తలలో తెల్లజుట్టు వచ్చేస్తుంది. జుట్టు నల్లబడేందుకు ప్రధాన కారణం మెలనిన్. ఒత్తిడి పెరిగితే శరీరంలో మెలనిన్ ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతాయి. దీని వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. తెల్లబడ్డ జుట్టును ఇంటి వద్దే శులభమైన మార్గంలో నలుపురంగులో మార్చుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఉసిరిక , గోరింట పొడి తెల్లబడ్డ జుట్టును నల్లబడేలా మార్చటంలో చక్కగా ఉపకరిస్తుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా అర కప్పు గోరింటాకు పొడి, అర కప్పు ఉసిరిక పొడి, ఒక గుడ్డు మరియు నిమ్మకాయ తీసుకోవాలి. ఆతరువాత ఉసిరికపొడి, గోరింటాకు పొడిని బాగా కలిపి నీరుపోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాతి రోజు ఉదయం, మిగిలిన పదార్ధాలను కూడా కలపాలి. ఇప్పుడు మీ జుట్టును పాయలుగా విడదీసి జుట్టంతా పట్టేటట్లు, జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకోవడం పూర్తయ్యాక 20- 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. తరువాత షాంపూతో తలరుద్దుకోంది. ఇలా క్రమం తప్పకుండా నెలకి ఒకటి లేకా రెండుసార్లు చేస్తే, మీ జుట్టు నల్లగా మారుతుంది.
దీంతో పాటు షాంపూలు, కండీషనర్లు మానేసి సహజసిద్ధంగా లభించే శీకాయ, కుంకుడు కాయను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం రాసి ఆ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే ఫలితం ఉంటుంది. నువ్వుల పేస్టులో బాదం నూనెను కలిపి..రోజూ తలకు రాయడం కూడా ఫలితాన్నిస్తుంది. ఉసిరిపొడిలో కాస్త నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించి రెండు గంటల తరువాత స్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది.