హిందూ మహిళపాడెను మోసి అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 11:20 AM IST
హిందూ మహిళపాడెను మోసి అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

Updated On : April 28, 2020 / 11:20 AM IST

దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో 65ఏళ్ల హిందు మహిళ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏ వాహనాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనా భయంతో ఎవరూ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో మహిళ అంత్యక్రియల్లో సాయం చేసేందుకు పక్కంటి ముస్లిం యువకులు ముందుకు వచ్చారు. 

మహిళ పాడేను మోసి తమలోని మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. కరోనా భయంతో ఆమె బంధువుల్లో  ఎవరూ కూడా ముందుకు రాలేదు. మృతురాలి ఇద్దరు కుమారులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో తమ ముఖాలకు మాస్క్‌లు ధరించిన ముస్లిం యువకులు మహిళ మృతదేహాన్ని శ్మశానవాటిక దగ్గరకు పాడేలో మోసకెళ్లారు. 

 సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరం వరకు ముస్లిం యువకలే తమ భుజాలపై మహిళ పాడేను మోశారు. మత సామరాస్యాన్ని చాటేలే హిందు మహిళ పాడేను మోసిన ముస్లిం యువకులను కాంగ్రెస్  ప్రతినిధి నరేంద్ర సాలుజా ప్రశంసించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా వారిని అభినందించారు. సమాజంలో మత సామరస్యానికి వీరే మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. 

ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 65ఏళ్ల మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న ముస్లిం యువకులు మీడియాతో మాట్లాడుతూ.. తమ చిన్నప్పటినుంచి ఆమె బాగా తెలుసునని, అందుకే తమ బాధ్యతగా మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు చెప్పారు. మార్చి 24 నుంచి భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటివరకూ 4వేల మందికి సోకింది.