Pain Killers : సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీసే పెయిన్ కిల్లర్స్..
గాయాల వల్ల , అలసట లేదా ఇతర చిన్న సందర్బాల్లో వచ్చే నొప్పుల నివారణకు తీసుకొనే పెయిన్ కిల్లర్స్ లైఫ్ సేవర్స్ గా ఉంటాయి.

Pain Killers
Pain Killers : పెయిన్ కిల్లర్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ మోతాదుకు మంచి రెగ్యులర్ గా తసీుకోవడం వల్ల కాలేయం, కిడ్నీ జబ్బులు తప్పవని అంటున్నారు . నొప్పి నివారణ మందులు వాడే సందర్భంలో మూడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి సురక్షితమైనవై ఉండాలి. తక్కువ ప్రభావం కలిగినవై ఉండాలి. వాటిని తక్కువ కాలం పాటు వాడుకోవాలి. సాధారణ పెయిన్ కిల్లర్స్ ఎసిటమినోఫిన్ లేదా ఇబ్యుప్రోఫెన్, డిక్లొఫినాక్ మొదలైన నాన్ స్టిరాయిడల్ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి.
ఈ రెండు రకాల మందుల పనితీరు భిన్నంగా ఉంటుంది. నాన్ స్టిరాయిడల్ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పినీ, ఇన్‌ఫ్లమేషన్‌నూ కలిగించే హార్మోన్లను పోలిన ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి. అసిటమినోఫిన్… నొప్పికి సంబంధించిన సంకేతాలను అందుకునే మెదడులోని భాగాల మీద పని చేస్తాయి. నాన్ స్టిరాయిడల్ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ వీటికి యధేచ్ఛగా వాడితే గుండె సమస్యలు పెరగడంతోపాటు కడుపులో పుండ్లు, రక్తస్రావం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఈ మందులతో మూత్రపిండాలు, కాలేయ రుగ్మతలు కూడా పెరుగుతాయి.
పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా, పారాసెటమాల్ ఇది లివర్ డ్యామేజ్ కు కారణా అవుతుంది. పారాసెటమాల్లో ఉండే పెరాక్సిడెస్ మెటబాలిజంకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి పారాసెటమాల్ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. ఒక రోజుకు 8మాత్రలు తీసుకోవడం వల్ల సీరియస్ అక్యూట్ లివర్ డ్యామేజ్ కు కారణం అవుతుంది. పెయిన్ కిల్లర్స్ లో ఐబ్రూఫిన్, ఆస్పిరిన్, మరియు నోప్రాక్సిన్ వంటివి పొట్టకు చీకాకు కలిగించి డ్యామేజ్ చేస్తుంది. పొట్టలో ఇన్నర్ లైన్ ను డ్యామేజ్ చేసి, అల్సర్ కు దారితీస్తుంది. మరియు ఉన్న అల్సర్ తో పాటు బ్లీడింగ్ కు దారితీస్తుంది.
పెయిన్ కిల్లర్ లేదా అనాల్జిక్ మరియు ఐబ్రూఫిన్ మరియు నాప్రోక్సిన్ వంటి పెయిన్ కిల్లర్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది . ముఖ్యంగా డయాబెటిస్ మరియు బ్లడ్ ప్రెజర్ ఉన్నవారిలో ఇది మరింత తీవ్రంగా ప్రభావం చూపుతుంది. మహిళలు రెగ్యురల్ గా తీసుకొనే పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో 20 వారాలపాటు తీసుకొనే డ్రగ్స్ వల్ల కూడా గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. హార్మోన్స్ కు గర్భదారణకు దగ్గరి సంబంధం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ప్రసవ సమయంలో ఇబ్బంది కలిగిస్తాయి.
బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ తీసుకోవనే వారు అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ను నివారించాలి. ఇవి మరిన్ని బ్లడ్ క్లాట్స్ మరియు బ్లీడింగ్ కు దారితీస్తుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య. పరగడుపున తీసుకోవడం వల్ల హైపర్ అసిడిటి వల్ల వాంతులకు దారితీస్తుంది . ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ తో బాధపడే వారు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తోనే పెయిన్ కిల్లర్స్ వాడాలి.
గాయాల వల్ల , అలసట లేదా ఇతర చిన్న సందర్బాల్లో వచ్చే నొప్పుల నివారణకు తీసుకొనే పెయిన్ కిల్లర్స్ లైఫ్ సేవర్స్ గా ఉంటాయి. అయితే నొప్పి దేనివల్ల వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడం వల్ల ఆ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగపడుతాయో తెలుసుకోవచ్చు. నొప్పిని తగ్గించే మందులను వీలైనంత తక్కువగా వాడుకోవాలి. నొప్పిని తగ్గించుకోవడం మీదే దృష్టి పెట్టకుండా, అందుకు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. మందులతో నొప్పి అదుపులోకి రాకుండా క్రమేపీ పెరుగుతూ ఉన్నా, నొప్పితో పాటు జ్వరం, విరోచనాలు లాంటి అదనపు ఆరోగ్య సమస్యలు మొదలైనా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్‌తో ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఈ మందులను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు.