Parenting Tips : మీ పిల్లల్ని సమానంగా చూస్తున్నారా?.. లేదంటే..

తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే. కానీ ఒక్కోసారి వారు చూపించే ప్రేమలో పిల్లలకు తేడా కనిపించవచ్చు. తమను సమానంగా చూడట్లేదనే భావం కలగచ్చు. అలాంటి ఫీలింగ్ రాకుండా పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Parenting Tips : మీ పిల్లల్ని సమానంగా చూస్తున్నారా?.. లేదంటే..

Parenting Tips

Updated On : September 23, 2023 / 2:23 PM IST

Parenting Tips : తల్లిదండ్రులు పిల్లల్ని ప్రాణంగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ ఒక్కోసారి వారికి నిజంగానే తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమ అందుతోందా? ఇద్దరు.. లేదా ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాల్లో పేరెంట్స్ వారికి సమానంగా ప్రేమను పంచగలుగుతున్నారా?

Delayed Speech : పిల్లలు మాట్లాడటం లేదంటే.. కారణం ఇదే!

పిల్లలకు సరైన వయసులో తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. ప్రేమ అంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు.. ఒక్కోసారి ప్రేమను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా పిల్లల్లో ఒక భరోసా ఉంటుంది. అలా వ్యక్తపరచడానికి కొన్ని మార్గాలున్నాయి.

ఇద్దరు లేదంటే ఎక్కువమంది ఉన్న కుటుంబాల్లోని పిల్లలకి తమ తల్లిదండ్రులు తమనను సమానంగా ప్రేమిస్తున్నారనే భరోసా ఉండాలంటే ఆ కుటుంబంలోని పేరెంట్స్‌కి ఒక  ప్రణాళిక అవసరం. మొదటగా పిల్లలందరి వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. ఒకరితో ఒకరిని పోల్చడం.. ఒకరికి ఎక్కువగా సపోర్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. పేరెంట్స్ ప్రతి బిడ్డతో వ్యక్తిగత సమయాన్ని గడపడం.. ప్రతి బిడ్డ తమకు ముఖ్యమైనవారే అని భావించేలా ఉండటం చాలా అవసరం. తల్లిదండ్రులు వారి సెల్ ఫోన్ పక్కన పెట్టి పిల్లలపై శ్రద్ధ వహించాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

PFAS in rainwater : వర్షంలో తడిస్తే ఇకపై పిల్లలు పుట్టరట

పేరెంట్స్ పిల్లలందరితో కలిసి కబుర్లు చెప్పడం.. వారితో కలిసి గేమ్స్ ఆడటం వంటివి చేస్తూ వారి ప్రపంచంలోకి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో కూడా ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలన్నా వారి బంధం చిన్నతనం నుంచి బలంగా ఉండాలన్నా పేరెంట్స్ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వారందరూ తమకు సమానమేనని.. వారికి తగిన విలువ ఇస్తున్నారనే విషయాన్ని పిల్లలు గ్రహించగలగాలి.

కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఎత్తి చూపుతారు. విపరీతంగా కొడుతుంటారు. చిన్న చిన్న అపజయాలను సైతం ఎత్తి చూపిస్తూ ఎద్దేవా చేస్తుంటారు. అలా చేయోద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏ విషయంలో అయినా పేరెంట్స్ నుంచి సపోర్ట్ కోరుకుంటారు. కాబట్టి వారు చేసే పొరపాట్లను సున్నితంగా చెప్పడం.. వారు ఫెయిల్యూర్స్‌ను అధిగమించేలా కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరం. పిల్లలు ఒత్తిడిలో ఉన్నట్లుగా అనిపిస్తే వారిపై పేరెంట్స్ ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.

China : ఆ స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు కునుకు తీయాలంటే ఫీజు కట్టాలి.. ఎక్కడంటే?

కొందరు పిల్లలు సున్నిత మనస్కులుగా ఉంటారు. పైకి నవ్వుతూ తీసుకున్నా దాని గురించి బాగా ఆలోచిస్తారు. తనకంటే తన అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్లను పేరెంట్స్ బాగా చూసుకుంటున్నారనే ఆలోచన కలిగితే దాన్ని వెంటనే దూరం చేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి మొదటి నమ్మకం.. మొదటి భరోసా తల్లిదండ్రులే. వారిచ్చే భరోసా జీవితంలో వారు ధైర్యంగా నడవడానికి బాటలు వేస్తుంది.