China : ఆ స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు కునుకు తీయాలంటే ఫీజు కట్టాలి.. ఎక్కడంటే?
అక్కడ స్కూల్లో పిల్లలు మధ్యాహ్నం వేళ న్యాప్ తీయాలంటే ఫీజు కట్టాలి. ఇదేం చోద్యం? అనుకుంటున్నారా? నిజం.. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.

China
China : చైనాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్ధులు నిద్రపోవడానికి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో పెద్ద వివాదమే చెలరేగింది.
Typhoon Saola: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు బయటికి రావొద్దని చైనాలో ఆదేశాలు.. ఎందుకో తెలుసా?
చైనాలోని జీషెంగ్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం విద్యార్ధుల నుండి మధ్యాహ్నం నిద్రించడానికి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త పాలసీ ప్రకారం విద్యార్ధులు తమ డెస్క్‌ల వద్ద నిద్రపోవాలని ఎంచుకుంటే ఒక్కో టర్మ్‌కు 200 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ.2,275) చెల్లించాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్ మ్యాట్‌ల సౌకర్యం కావాలనుకునేవారు 360 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ.4,094) చెల్లించాల్సి ఉంటుంది. ఇక బెడ్‌లతో కూడిన ప్రైవేటు గదుల్లో విశ్రాంతి తీసుకోవాలనుకునే విద్యార్ధులకు 680 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7,856) చెల్లించాలి.
China : చైనాలో కొత్త ట్రెండ్ .. టెంపరరీ పార్టనర్స్‌ని కోరుకుంటున్న యువత
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ విషయాన్ని తమ నివేదికలో వెల్లడించింది. ఇక్కడ ఇలాంటి ఫీజులు నిర్ణయించడంలో ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం మంజూరు చేసారు. అయితే ఈ న్యాప్‌లు తప్పనిసరి కాదని , విద్యార్ధులు భోజన విరామ సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉందని పాఠశాల నొక్కి చెబుతోంది. అయితే పాఠశాలలో విశ్రాంతి తీసుకునేందుకు విద్యార్ధుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో చాలామంది పాఠశాల నిర్ణయాన్ని తప్పు బట్టారు.