Piles Problem : పైల్స్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!

ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. దీనిలో ఫైబర్ తక్కువగా ఉండి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సమస్య పెరిగి ఇబ్బందికలుగుతుంది. వీటికి బదులు ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవటం మంచిది.

Piles Problem : పైల్స్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!

Piles Problem

Updated On : June 4, 2022 / 4:27 PM IST

Piles Problem : మల ద్వారం నొప్పి, దురద మరియు రక్తస్రావం ఉంటే దీనిని పైల్స్ సమస్యగా గుర్తించవచ్చు. పైల్స్ వల్ల ప్రమాదమేమి లేకపోయినప్పటికీ, ఇబ్బందిని కలిగిస్తుంటాయి. మలబద్ధకం సమస్య వల్లే ప్రధానంగా పైల్స్ వస్తుంటాయి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా పాల ఉత్పత్తులు మలబద్ధకానికి కారణమౌతాయి. పాలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. పాలల్లో ఉండే ప్రొటీన్ కారణంగా సమస్య మరింత తీవ్రతరమౌతుంది. కాబట్టి, మీ రోజువారీ పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం మంచిది. లేదంటే సోయా పాలను ఉపయోగించవచ్చు.

ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల పైల్స్ సమస్య పెరుగుతుంది. దీనిలో ఫైబర్ తక్కువగా ఉండి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సమస్య పెరిగి ఇబ్బందికలుగుతుంది. వీటికి బదులు ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవటం మంచిది. అయితే పండ్లను కూడా పూర్తిగా పండిన వాటినే తీసుకోవాలి. పచ్చివి తినటం ఏమాత్రం మంచిది కాదు. వైట్ రైస్, వైట్ బ్రెడ్, కుక్కీలు, కేక్‌లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలలో ఫైబర్‌లో చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తినటం వల్ల సమస్య మరిత పెరుగుతుంది.

గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాలు మలబద్ధకం మరియు పైల్స్‌కు కారణమవుతాయి. గ్లూటెన్ అనే ప్రోటీన్ గోధుమలు మరియు బార్లీ వంటి ధాన్యాలలో కనిపిస్తుంది. గ్లూటెన్ కొంతమందిలో ఆటో ఇమ్యూన్ వ్యాధికి దారి తీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ వారి జీర్ణక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మలబద్ధకం పైల్స్‌ను ప్రేరేపిస్తుంది. పైల్స్‌తో బాధపడే వారు ఐరన్ సప్లిమెంట్లను తీసుకుంటే అది మలబద్ధకానికి దారి తీస్తుంది.

ఆల్కహాల్ శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది, ఇది మలబద్ధకం సమస్యను తీవ్రంగా చేస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు మద్యం సేవించటం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం పెరుగుతుంది. ఎందుకంటే రెడ్ మీట్‌లో చాలా తక్కువ పీచు , కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. సులభంగా జీర్ణం కాదు, శరీరం నుండి బయటకు రావడానికి సమస్యలను కలిగిస్తుంది. కావున రెడ్ మీట్ కు పైల్స్ సమస్య ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది. పైల్స్ సమస్య తీవ్రంగా ఉన్నవారు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందటం ఉత్తమం.