Diabetes : మధుమేహం ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి!.

రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు ఇలాంటి మాంసాలను సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం.

Diabetes : మధుమేహం ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి!.

Diabetes

Updated On : March 24, 2022 / 12:38 PM IST

Diabetes : మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్ధాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. నిత్యం అనేక జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వైద్య చికిత్స తోపాటు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులు తోడైతే మధుమేహం అదుపులో ఉంటుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పాటించవలసిన జాగ్రతలు :

భోజన వేళలను క్రమం తప్పకుండా పాటించాలి. తీసుకునే ఆహారంలో అత్యధికంగా సంక్లిష్టమైన పిండి పధార్థలు అనగా చిరుధన్యాలు కొర్రలు,అరికలు, సామలు, ఉధలు, ఆండ్రకొర్రలు మొదలైన ముడి ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. రెఫైండ్ చేయని పదార్థాలతో బాటు అన్నిరకాలైన కూరగాయలు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తీసుకోవాలి. సాద్యమైంనంత వరకు దుంప కూరలకు దూరంగా ఉండాలి. భోజనంలో అన్నము, రొట్టెల కన్నా ఉడికించిన కూరగాయలు ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి.

పండ్లలో ఆపిల్, దానిమ్మ, జామ, నారింజ, బత్తాయి మరియు బొప్పాయి పండ్లు తీసుకొనవచ్చు. పండ్ల రసాలు త్రాగరాదు. బేకరీ పదార్థాలు, కూల్ డ్రింక్స్ తీసుకొనరాదు. పండ్లను తినడం వల్ల అందులోని పీచు పదార్థాలు రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించి, ఆరొగ్యకరమైన కొవ్వులను పెంచి, జీర్నశక్త్థిని పెంపొందించి, మలవిసర్జన సుఖవంతంగా ఉండుటకు సహకరిస్తాయి. పండ్లలో మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా మరియు సీతాఫలం లో చక్కర శాతం అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత వహించాలి.

రెడ్ మీట్, అవయవాలకు సంబంధించిన మాంసం లీవర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు ఇలాంటి మాంసాలను సాద్యమైనంత వరకు తీసుకొనక పోవడం ఉత్తమం. ఆహారంలో అధికంగా ఉప్పుకలిగిన పదార్థాలు ఉరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, పొడులు మరియు నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకొనరాదు. ఒకసారి మరిగించిన నునెలను మళ్లీ వంటలలో వాడరాదు. రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్లు నీరు త్రాగాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా 45 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. ధూమపానం, అల్కహల్ పూర్తిగా మానివేయాలి.