Exercise : గంటల తరబడి వ్యాయమంతో సంతానలేమి సమస్యలు?

అధిక బరువును అధిగమించటానికి వ్యాయామాలతో చెక్ పెట్టవచ్చు. అలాగే ప్రతి రోజు ఎక్సర్‌సైజ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Exercise : గంటల తరబడి వ్యాయమంతో సంతానలేమి సమస్యలు?

Exercise

Updated On : January 17, 2022 / 11:50 AM IST

Exercise : ఇటీవలికాలంలో వ్యాయామం అనేది రోజువారి దినచర్యలో ఒక భాగమైపోయింది. ముఖ్యంగా యువత వ్యాయామాలపై ఎక్కవగా దృష్టిపెట్టింది. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి దోహదపడుతుంది. ఈక్రమంలో చాలా మంది గంటల తరబడి మంచి శరీర సౌష్టవం కోసం జిమ్ లకే పరిమితమై పోతున్నారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే కోరికతో శ్రమిస్తున్నప్పటికీ ఓవర్ గా ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. ముఖ్యంగా వివాహంమైన తరువాత నిత్యం జిమ్ ఎక్సర్ సైజులు చేస్తూ ఎక్కవ సమయం గడిపేవారిలో సంతానలేమి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక బరువును అధిగమించటానికి వ్యాయామాలతో చెక్ పెట్టవచ్చు. అలాగే ప్రతి రోజు ఎక్సర్‌సైజ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, డైలీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి కూడా దూరం చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం రోజు రెండు గంటలు ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అతిగా చేస్తే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పిల్లలు పుట్టేందుకు శరీరంలోని కొవ్వు కూడా సాయం చేస్తుంది. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది. కొవ్వులు కరగటం వల్ల సంతాన సమస్యలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఈ సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వాస్తవానికి పెళ్లి అనేది దాంపత్య జీవితానికి ప్రారంభం మాత్రమే…సంతానం కలిగినప్పుడే ఆదంపతుల దాంపత్య జీవితం ఫలవంతమైనట్లు. అయితే ఈ సంతాన సమస్యలు కలగడానికి ఎక్సర్‌సైజ్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాలను నిర్ణీత సమయానికి మించి చేస్తే మాత్రం సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా వ్యాయామాలు చేయటం వల్ల చివరకు అసలుకే ఎసరువచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.