Anger : లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారా? అయితే కోపం తెచ్చుకోండి

తన కోపమే తన శత్రువు అంటారు.. కోపం అనారోగ్య హేతువు అని కూడా అంటారు. అయితే కోపం వల్ల లాభాలు కూడా ఉన్నాయట. తాజా పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చదవండి.

Anger : లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారా? అయితే కోపం తెచ్చుకోండి

Feeling Angry

Updated On : November 6, 2023 / 5:31 PM IST

Anger : కోపంగా ఉన్నవాళ్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారని అంటారు. కానీ తాజా పరిశోధనలు మీరు మీ లక్ష్యాలను సాధించాలని అనుకుంటే కోపం తెచ్చుకోమని చెబుతున్నాయి. మీరు విన్నది నిజమే.

Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !

అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎదరయ్యే సవాళ్లను అధిగమించాలంటే కోపం అనే ఎమోషన్ సహాపడుతుందని కొత్త పరిశోధన చెబుతోంది. జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని చెబుతోంది. ఈ అధ్యయనం ద్వారా విచారం, కోరిక, వినోదం ఇలాంటి భావోద్వేగాలను అనుభవించిన వారి కంటే  కోపంతో ఉన్నవారు భిన్నమైన సవాళ్లను ఎదుర్కుని పనిచేస్తారని కనుగొన్నారట.

టెక్సాస్‌ A & M విశ్వవిద్యాలయంలో 233 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులపై పరిశోధన జరిగిందట. ప్రతి విద్యార్ధికి ఒక్కో భావోద్వేగాన్ని కేటాయించారట. కోపం, కోరిక, విచారం, తటస్థంగా వంటి భావోద్వేగాలను వారికి కేటాయించడంతో పాటు.. వీరికి కొన్ని పజిల్స్ పరిష్కరించేలా పరీక్ష పెట్టారట. కోపంగా ఉన్నవారు పజిల్ పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఎక్కువ పట్టుదలను చూపించారట. కోపంతో ఉన్నప్పుడు పట్టుదల ఎక్కువై విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుందని A & M విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హీథర్ లెంచ్ చెప్పారు.

Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే

అయితే కోపం ఎప్పుడూ మంచిదేనా? అంటే మనస్తత్వ శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం కోపం అన్ని రకాల లక్ష్యాలను సాధించడానికి మాత్రం ఉపయోగపడదట. కోపం కొన్నిసార్లు అరచేతుల్లో చెమటలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి వాటికి దారి తీస్తుంది. యూరోపియన్ హార్ట్ జర్నల్ 2022 అధ్యయనం ప్రకారం కోపం కొన్ని గుండె సంబంధిత వ్యాధులకు దోహదపడుతుందని కనుగొన్నారు. కాబట్టి కోపం అనేది ఎంచుకున్న లక్ష్యాలను సాధించే విధంగా పట్టుదలకు దారి తీస్తే ప్రయోజనకారిగా ఉంటుందని మితిమీరిన కోపం అనర్ధాలకు దారి తీస్తుందని కూడా పరిశోధనలో వెల్లడించారు.