Social Media Pressure : మీ పోస్టులకి ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి? పదే పదే చెక్ చేస్తున్నారా?
ఎవరి జీవితంలో ఏం జరిగినా వారి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అనుక్షణం వాటిని ఫాలో అవుతూ అప్ డేట్లు పెట్టుకునేవారు ఎక్కువయ్యారు. ఇక వాటిని చూసుకుంటూ ఇతరులు ఎలా స్పందిస్తున్నారని చెక్ చేస్తూ తెలీని ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పురుషుల కంటే కూడా మహిళల్లో ఆందోళన ఎక్కువ అయ్యిందని కొన్ని పరిశోదనలు చెబుతున్నాయి

Social Media Pressure
Social Media Pressure : మన ఇంట్లో.. మన జీవితంలో ఏం జరిగినా సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఏ ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ జరిగినా సోషల్ మీడియాలో షేర్ చేయాలి. మన కష్టాలు, నష్టాలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయాలి. ఏడవడం.. నవ్వడం.. కోప్పడటం.. అన్నీ సోషల్ మీడియాలోనే. ఇలా పూర్తిగా మనకి మనం సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల లాభమా? నష్టమా? దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు.. ఒత్తిడులు ఎదుర్కోవాలి?
Friendships on social media : సోషల్ మీడియా స్నేహాలు సేఫేనా? వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటే అంతే…..
ఒకరోజు సోషల్ మీడియా యాప్స్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తేనే భరించలేరు. అంతగా సోషల్ మీడియాతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఏర్పడింది. ఎన్నో మంచి విషయాలకు వేదికగా ఉండే ఈ యాప్స్‌కి అతిగా మనం ఎడిక్ట్ అయితే అనర్ధాలు కూడా ఉన్నాయి. కొంతమంది తరచుగా పోస్టులు పెడుతుంటారు. ఆ పోస్టు పెట్టేసి ఆ తరువాత ఎప్పుడో దానిని చూడటం కాదు.. పదే పదే దానిని చెక్ చేస్తుంటారు.. ఎంతమంది దానిని లైక్ చేశారు? ఎన్ని కామెంట్లు వచ్చాయి? ఎవరు మన పోస్టువైపు తొంగి చూడలేదు? ఇలా రోజు మొత్తం ఆ పోస్టు మీదనే గడుపుతారు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తారు. ఎవరైనా లైక్ కొట్టకపోతే.. ఎందుకు కొట్టలేదని? ఆలోచించేవారు.. దెబ్బలాడేవారు ఇలా రకరకాల మనస్తత్వాలు ప్రదర్శించేవారు ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఒత్తిడికి గురయ్యేవారిలో ఎక్కువమంది స్త్రీలే ఉన్నారట. దాంతో వీరు విపరీతమైన ఆందోళన ఎదుర్కుంటున్నారని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
చాలామంది పగలు, రాత్రి కూడా సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉంటారు. దానివల్ల కూడా అనారోగ్యాలపాలయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా సోషల్ మీడియాలో టైం గడిపేవారిలో తెలియని ఆందోళన, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి. ఇక ఏదో ఒక మాధ్యమం కాకుండా 3 కంటే ఎక్కువ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండేవారిలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుందని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియా అనుబంధాలతో జాగ్రత్త..
ఇక నెగెటివ్ పోస్టులు చేసేవారు ఎక్కువగా డిప్రెషన్‌కి గురవుతున్నారట. ఆన్ లైన్ వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనే 24 గంటలు గడపడం కూడా ఓ వ్యసనంగానే భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దానికి ఎడిక్ట్ అయ్యి.. సమయం అంతా దానికే కేటాయిస్తూ చదువుల్లో వెనుకబడేవారు.. మానవ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదుర్కునేవారు ఎక్కువయ్యారట. సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవారిలో జెలసీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఇతరుల పోస్టుల్లో వారు సాధించిన విజయాలు, వారి స్టేటస్‌లు చూస్తే అసూయ కలుగుతుందట. ఈ విషయాన్ని కొన్ని సర్వేలు చెప్పాయి. అయితే ఈ అసూయ వల్ల పోటీ తత్త్వం పెరిగితే మంచిదే.
ఎప్పుడు సోషల్ మీడియాలో గడిపేవారు నిజానికి చాలామందిని కోల్పోతారు. ఆ ప్రపంచంలో చాలామందితో ఉన్నామనుకునే భ్రమలో చుట్టూ ఉన్నవారిని కోల్పోతూ ఒంటరివారు అయిపోతారు. ఏదైనా అతి అయితే చేటు అంటారు పెద్దలు. కాబట్టి సోషల్ మీడియా మనకు ఎంతవరకూ ఉపయోగమో అంతవరకూ వినియోగిస్తే మనిషికి శారీరక ఆరోగ్యాన్ని.. మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.