కొందరు మగవారిలో ‘ద్విలింగ సంపర్కం’ వాస్తమేనని పరిశోధకులు తేల్చేశారు!

ఆకర్షణ.. మగ లేదా ఆడ వారిలో సహజమే.. స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కుల్లోనూ ఇదే తరహా ఆకర్షణ కనిపిస్తుంది. సాధారణంగా భిన్న లింగాలకు సంబంధించి పరిశీలిస్తే.. ఒకరిపై మరొకరికి ఆకర్షణ ఉండటం కామన్.. అది ఒకే లింగానికి చెందినవారు కావొచ్చు.. లేదో భిన్న లింగాలకు చెందిన ఆకర్షణ కావొచ్చు.. ఒక పురుషుడు మరో పురుషుడిని ఆకర్షించడం.. వీరిని స్వలింగ సంపర్కులుగా పిలుస్తారు.. ఇద్దరు మహిళల్లో అయితే లెస్బియన్ అని పిలుస్తారు. ఒక పురుషుడు.. స్త్రీపై ఆకర్షణతో పాటు మరో పురుషుడిపై కూడా ఆకర్షితుడు కావడాన్ని ద్విలింగ సంపర్కమని పిలుస్తారు. మగవారిలో ద్విలింగ సంపర్కమనేది వాస్తమేనని పరిశోధకులు తమ పరిశోధనల్లో తేల్చేశారు.
యుఎస్, యుకెలోని బహుళ సంస్థలతో అనుబంధంగా ఉన్న పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. మగ ద్విలింగత్వానికి సంబంధించి కొన్ని వివరాలను కనుగొన్నారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ బృందం మగవారిలో ద్విలింగ సంపర్కులు ఉంటారని తేల్చేశారు.పురుష ద్విలింగసంపర్కం అనేక ఇతర అధ్యయనాలను కూడా సమీక్షించారు. చాలా ఏళ్లుగా.. మగ ద్విలింగసంపర్కం వాస్తవానికి ఉనికిలో ఉందనే విషయంలో పరిశోధకులలో చాలా సందేహాలు ఉన్నాయి. పురుషులు సూటిగా లేదా స్వలింగ సంపర్కులు అని వాదించారు. ద్విలింగ సంపర్కులు అని చెప్పుకునే పురుషులు వాస్తవానికి స్వలింగ సంపర్కులుగా ఉంటారు. తమ స్వలింగ సంపర్కాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని సూచించారు.
ఇలాంటి సందేహాలు చాలా ఏళ్లుగా చాలా మంది పురుషులు ద్విలింగ సంపర్కులు అని గట్టిగా వాధిస్తునే ఉన్నారు. పురుషుల్లో ద్విలింగ సంపర్కం నిజమైన విషయమని వాదనలు వినిపిస్తుండగా.. కొందరు మహిళల్లో లైంగికంగా ఆకర్షించే అవకాశం ఉందని సూచించారు. మగ ద్విలింగ సంపర్కం, ఆడ ద్విలింగసంపర్కానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నాయో స్పష్టంగా తెలియదు. దాగిన నిజాన్ని వెలికి తీసేందుకు ఎన్నో ఏళ్లుగా చాలా పరిశోధక బృందాలు జవాబును కనిపెట్టే దిశగా అనేక అధ్యయనాలు చేశాయి.
ఈ కొత్త ప్రయత్నంలో భాగంగా పరిశోధకులు మగ ద్విలింగసంపర్క అధ్యయనాన్ని మునుపటి పరిశోధల ఆధారంగా అధ్యయనం చేయాల్సి ఉందని అంటున్నారు. అప్పుడే దీనికి సరైన సమాధానం దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. ద్విలింగసంపర్కం నిజమేనంటూ ముందస్తు పరిశోధనలో తేలిందని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమంది పురుషులు నిజంగా లింగానికి చెందిన వ్యక్తులచే లైంగికంగా ప్రేరణకు గురవుతారని గుర్తించారు.
పురుషులలో ద్విలింగసంపర్కులు ఉన్నారనే వాదనను కూ డా ధృవీకరించారు. కొందరు స్వలింగసంపర్కం వైపు మొగ్గు చూపుతారు. మరికొందరు భిన్న లింగసంపర్కం వైపు మొగ్గు చూపుతారు. లింగ ఆకర్షణలో మాత్రం కొందరు సమానంగా ప్రేరణ చెందుతుంటారు. కొందరు మగవారిలో ద్విలింగ సంపర్కులు ఉంటారనడానికి ఆధారాలు బలంగా ఉన్నాయని ఫైనల్‌గా పరిశోధకులు తేల్చేశారు.