Teeth Regrowth: ఊడిన పళ్లు పెరగడానికి దారి దొరికింది

పళ్లలో సమస్య వస్తే అవి ఏదో ఒక రోజు కచ్చితంగా ఊడిపోవాల్సిందే. మరి వాటి స్థానంలో కొత్తవి సాధ్యమవుతుందని..

Teeth Regrowth: ఊడిన పళ్లు పెరగడానికి దారి దొరికింది

Teeth Regrowth

Updated On : March 31, 2021 / 6:49 AM IST

Teeth Regrowth: పళ్లలో సమస్య వస్తే అవి ఏదో ఒక రోజు కచ్చితంగా ఊడిపోవాల్సిందే. మరి వాటి స్థానంలో కొత్తవి రావని మనకు తెలుసు. కానీ, ఇప్పుడు అది కూడా సాధ్యమవుతుందని అంటున్నారు రీసెర్చర్లు. యూఎస్ఏజీ-1 వంటి జీన్స్ తో యాంటీబాడీలు డెవలప్ అవుతాయి. అలా అవడం వల్ల ముత్యాల్లాంటి పళ్లు తిరిగి వచ్చేందుకు హెల్ప్ అవుతాయట.

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో ప్రచురితం అయినదానిని బట్టి ఎలుకపిల్లలపై చేసిన ప్రయోగంలో జెనెటికల్ మార్పులు గమనించారు. పళ్లు లేకుండా ఇబ్బందిపడే ఎలుకలు, సగం విరిగిన పళ్లు ఉన్న వాటిపై జన్యు మార్పులు జరగడంతో పునరుద్ధరణ జరిగింది.

రీసెర్చర్లు USAG-1 జీన్ ను టార్గెట్ చేసి స్టడీ చేశారు. బీఎంపీ, డబ్ల్యూఎన్టీ లాంటి సిగ్నలింగ్ మాలిక్యూల్స్ టూత్ డెవలప్మెంట్ కు ఉపయోగపడతాయి. ఈ కాంపౌండ్లు పళ్లతో పాటు పలు అవయవాలు ఎదగడానికి ఉపయోగపడతాయి. కాకపోతే వీటితో పాటు సైడ్ ఎఫెక్ట్ లు కూడా లేకపోలేదు.

ఈ ప్రయోగాల్లో భాగంగా మోనోక్లోనల్ యాంటీబాడీలపై ప్రయోగాలు జరిపారు. ఇలా చేసిన ప్రయోగంలో యూఎస్ఏజీ-1 జీన్ దుష్ఫ్రభావాలు జరగకుండా పళ్ల ఎదుగుదలకు మాత్రమే సహకరిస్తాయి. ఇక ఈ ప్రయోగాన్ని పందులు, కుక్కలపై కూడా జరిపి పాలిచ్చి పెంచే జీవాలకు పళ్లు వస్తాయా అనే కోణంలో మరోసారి ప్రయోగాలు జరపనున్నారు.