విచారం ఉన్న వ్యక్తులు ఛైన్ స్మోకర్స్ అయ్యే ఛాన్స్

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 04:40 AM IST
విచారం ఉన్న వ్యక్తులు ఛైన్ స్మోకర్స్ అయ్యే ఛాన్స్

Updated On : January 13, 2020 / 4:40 AM IST

విచారం, నెగటివ్ ఎమోషన్స్ ఉన్న వారు ధూమపానానికి ఆకర్షితులవుతుంటారని, ఛైన్ స్మోకర్స్‌గా తయారు కావడానికి అవకాశం ఉందంటున్నారు అధ్యయనం చేసిన వారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం స్టడీ చేసింది. కోపం, అసహ్యం, ఒత్తిడి, విచారం, భయం, అవమానం ప్రతికూల భావన ఉన్నా..వారు మాదకద్రవ్యాల వైపు దృష్టి మళ్లుతుందని ప్రధాన పరిశోధకుడు చార్లెస్ ఎ.డోరిసన్ వెల్లడించారు. 20 సంవత్సరాల్లో 10 వేల 685 మందిపై స్టడీ చేసి డేటాను పరిశీలించారు. 

ధూమపానం చేయడానికి విచారం, ప్రతికూలత వాతావరణం ఉందా అనే దానిపై రెండో అధ్యయనం చేశారు. 425 మంది స్మోకర్స్ ను సెలక్ట్ చేసి…వారిని స్టడీ చేశారు. వీరికి విచారకరమైన వీడియోలు చూసిన వారు స్మోకింగ్ చేయడానికి ఆసక్తి చూపించారని స్టడీలో తేలింది. ఎలాంటి ఒత్తిడి, విచారం లేని వారు..తక్కువ మోతాదులో సిగరేట్ కాలుస్తారని వెల్లడించారు. దీని ప్రభావం ఆర్థికంపై పడుతుందన్నారు.

ఒత్తిడి, నిరాశ, విసుగుదల ఎదుర్కోవడానికి ధూమపానానికి అలవాటు పడుతున్నారని గ్రహించినట్లు తెలిపారు. టీ తాగే సమయంలో, కార్యాలయాలు, ఇతర పనిలో ఉన్న సమయంలో సిగరేట్లు పీల్చడానికి ఆసక్తి చూపుతుంటారని తెలిపారు. కొంతమందిని కొన్ని గంటలకు పాటు సిగరేట్లు కాల్చకుండా చేసిన వారిని పరీక్షిస్తే..మరికాస్త అసహనానికి గురవుతున్నట్లు నిర్ధారించామని వెల్లడించారు. 

Read More : కొక్కొరొకో : సంక్రాంతి కోళ్ల పందాలకు రెడీ