Salt : ఉప్పు వాడకంలో పొదుపు మంచిదే!

ఉప్పు అధికంగా తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు దరిచేరతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో ఉప్పు తినటం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది.

Salt : ఉప్పు వాడకంలో పొదుపు మంచిదే!

Salt

Salt : వంటకాల్లో రుచికి ఉప్పును వాడతారు. వంటాలకు రుచిని కలిగించే గుణం ఉప్పుకు ఉంది. శరీర జీవక్రియలు సమర్ధవంతంగా పనిచేయాలంటే ఉప్పు అవసరం ఉంది. అయితే శరీరంలో నీరు, ఉప్పు రెండింటి సమతుల్యంగా ఉండాలి. శరీరంలో నీరు ఎక్కువైతే సోడియం తక్కువ అవుతుంది. నీరు తగ్గితే సోడియం పెరిగిపోతుంది. శరీరానికి అవసరానికి తగ్గట్టుగా సోడియం ప్రమాణాలను సరిచూసుకుంటూ ఉండాలి.

ఆరోగ్య వంతమైన వ్యక్తి రోజుకు 2 నుండి 6గ్రాముల ఉప్పును వాడొచ్చు. అయితే కొన్ని వ్యాధులకు గురైన వ్యక్తులు రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు రోజుకు 2 గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడుకోవాలి. అలాగే గుండె , కాలేయం, మూత్రపిండాలు ఈ మూడు అంతర్గత అవయవాల జబ్బులతో బాధపడే వ్యక్తులు 2గ్రాముల కంటే తక్కువే ఉప్పును తీసుకోవాలి. ఉప్పును పరిమితి మేరకు మాత్రమే వాడుకోవాలి. పరిమితికి మించి వాడినా, పరిమితికంటే తక్కువ వాడినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని వ్యాధులకు ఉపయోగించే మందులు సైతం శరీరంలో సోడియం పరిమాణంపై ప్రభావం చూపిస్తాయి.

వేసవిలో చెమట ద్వారా శరీరం నుండి ఉప్పు ఎక్కువగా బయటికి వెళ్లి పోతుంది. ఆసమయంలో ఉప్పు వాడకం పెంచుకోవచ్చు. నిమ్మరసం, మజ్జిగ లాంటి వాటిలో ఉప్పు వేసుకుని సేవించవచ్చు. ఉప్పు వాడకం అన్నది మనచేతుల్లో పనే. తినే చట్నీలు, సాస్ లను తీసుకునే వారు వాటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుందని గమనించాలి. ఉప్పుతో కూడిన చిప్స్ , పచ్చళ్లు, అప్పడాలు, జంక్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించాలి. మార్కెట్లో లభించే ఫుడ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే సందర్భంలో లేబుల్స్ పైన సోడియం పరిమాణాన్ని చూసుకోవాలి.

ఉప్పు అధికంగా తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు దరిచేరతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో ఉప్పు తినటం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది. ఉప్పు ఎక్కవ వాడకం వల్ల జీర్ణాశయ గోడలు దెబ్బతిని ఇన్ ఫెక్షన్లు, వాపు, క్యాన్సర్ ముప్పు సమస్యలు వస్తాయి. ఎక్కువ సోడియం తీసుకునేవారు అధిక మోతాదులో నీరు తాగాలి. ఉప్పు ఎక్కువ తీసుకునే వారిలో కాల్షియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. రక్తనాళాలపై ఒత్తిడి అధికమై రక్తపోటు సమస్య వస్తుంది. అందుకే ఉప్పు వాడకంలో ఎంత పొదుపు పాటిస్తే ఆరోగ్యానికి అంత మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.