Worlds Smallest Pacemaker : వావ్ సూపర్.. బియ్యం గింజ కన్నా చిన్నది, ప్రపంచంలోనే అతి చిన్న పేస్ మేకర్ తయారీ..
పిల్లల గుండె శస్త్రచికిత్సల సందర్భంలో తాత్కాలిక పేస్‌మేకర్ల అవసరం చాలా ముఖ్యం.

Worlds Smallest Pacemaker : నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే అతి చిన్న పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఎంత చిన్నగా ఉందంటే.. బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంది. సిరంజి కొన లోపల సరిపోతుంది, శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. కేవలం 1.8 మిల్లీమీటర్ల వెడల్పు, 3.5 మిల్లీమీటర్ల పొడవు, ఒక మిల్లీమీటర్ మందం మాత్రమే ఉన్న ఈ చిన్న పరికరం.. బియ్యం గింజ కంటే చిన్నది. సైజులో చిన్నదే అయినా పనితనంలో మాత్రం పవర్ ఫుల్ అంటున్నారు సైంటిస్టులు. పూర్తి పరిమాణ పేస్‌మేకర్ లానే దీని పని తీరు ఉంటుందన్నారు.
ఈ పరికరం అన్ని సైజుల గుండెలలో పనిచేయగలదు. కానీ దీనిని సైంటిస్టులు ప్రత్యేకంగా నవజాత శిశువుల కోసం డెవలప్ చేశారు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలున్న నవజాత శిశువుల చిన్న, పెళుసైన గుండెలకు ఈ పరికరం బాగా సరిపోతుందని వివరించారు.
ఈ పరికర అభివృద్ధికి నార్త్‌వెస్ట్రన్ బయోఎలక్ట్రానిక్స్ మార్గదర్శకుడు జాన్ ఎ రోజర్స్ నాయకత్వం వహించారు. దీనిపై ఆయన స్పందించారు. ”మాకు తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి చిన్న పేస్‌మేకర్‌ను మేము అభివృద్ధి చేశాము” అని జాన్ ఎ రోజర్స్ తెలిపారు. పిల్లల గుండె శస్త్రచికిత్సల సందర్భంలో తాత్కాలిక పేస్‌మేకర్ల అవసరం చాలా ముఖ్యమైనదని, సైజు విషయంలో మరీ ముఖ్యమైనదని ఆయన అన్నారు. పరికరం ఎంత చిన్నగా ఉంటే శస్త్రచికిత్సల సమయంలో అంత మేలు అని అభిప్రాయపడ్డారు.
Also Read : డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఏ దేశం ఉత్పత్తులపై ఎంతశాతం సుంకాలు విధించారంటే.. పూర్తి వివరాలు ఇలా..
ఈ చిన్న పేస్ మేకర్ పరికరం ఎలా పని చేస్తుంది..
”ప్రస్తుతం, తాత్కాలిక పేస్‌మేకర్లకు రోగి ఛాతిపై ఉన్న పవర్డ్ పరికరానికి వైర్లను అనుసంధానించే ఎలక్ట్రోడ్లను గుండె కండరాలకు కుట్టడానికి శస్త్రచికిత్స అవసరం. పరికరం ఇకపై అవసరం లేనప్పుడు, వైద్యులు వైర్లను బయటకు తీస్తారు, ఇది కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది. అయితే, కొత్తగా అభివృద్ధి చేయబడిన పేస్‌మేకర్ వైర్‌లెస్.
అంతేకాదు అవసరం లేనప్పుడు శరీరంలో కరిగిపోయేలా రూపొందించబడింది. విద్యుత్ సరఫరా చేయడానికి నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్‌ను ఉపయోగించకుండా, చిన్న పేస్‌మేకర్ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక రకమైన సాధారణ బ్యాటరీ గాల్వానిక్ సెల్ చర్య ద్వారా పని చేస్తుంది.
చుట్టుపక్కల బయోఫ్లూయిడ్‌లతో సంబంధంలోకి వచ్చినప్పుడు, ఎలక్ట్రోడ్‌లు బ్యాటరీని ఏర్పరుస్తాయి. ఫలితంగా వచ్చే రసాయన ప్రతిచర్యలు గుండెను ఉత్తేజపరిచేందుకు విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహిస్తాయి. పేస్‌మేకర్ రోగి ఛాతీపై ధరించే మృదువైన ప్యాచ్‌కు జతచేయబడుతుంది. శరీరంలోకి లోతుగా, సురక్షితంగా చొచ్చుకుపోయే ఇన్‌ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించింది. రోగి హృదయ స్పందన రేటు ఒక నిర్దిష్ట రేటు కంటే తక్కువగా ఉంటే, పరికరం గుర్తించి ఆటోమేటిక్ గా లైట్ ఎమిటింగ్ డయోడ్ ను యాక్టివేట్ చేస్తుంది. సాధారణ హృదయ స్పందనకు అనుగుణంగా లైట్ ఆన్, ఆఫ్ అవుతుంది” అని పరిశోధకులు వివరించారు.
పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన చిన్న చిన్న పిల్లలకు సాయం చేసేందుకు తాము ఈ కొత్త పరికరాన్ని రూపొందించామని పరిశోధకుల బృందం తెలిపింది.
Also Read : దెబ్బకు దెబ్బ.. అమెరికా మీద చైనా టారిఫ్… ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా..
”మా ప్రధాన దృష్టి పిల్లలపైనే. దాదాపు ఒక శాతం మంది పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మిస్తారు. కానీ చాలా మందికి శస్త్రచికిత్స తర్వాత తాత్కాలిక వేగం మాత్రమే అవసరం. దాదాపు ఏడు రోజుల్లో వారి గుండెలు స్వయంగా మరమ్మత్తు చేయబడతాయి” అని నార్త్‌వెస్ట్రన్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ అన్నారు. తొలగింపు కోసం మరో సర్జరీ అవసరం లేకుండా ఆ క్లిష్టమైన సమయంలో ఈ చిన్న పేస్‌మేకర్ శిశువులకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
Check out some brand new biomedical tech – crazy cool, in my own, humble but admittedly biased opinion – introduced in our paper (link below), published today in @Nature, titled “Millimetre-scale, bioresorbable optoelectronic systems for electrotherapy,” where we describe the… pic.twitter.com/fqf9GZTsTY
— John A Rogers (@ProfJohnARogers) April 2, 2025