Overheating : బాడీలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారా? దీనిని నుండి సులభంగా బయటపడాలంటే!

మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు మెడిసిన్‌‌పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య ను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను అనుసరించాలి.

Overheating : బాడీలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారా? దీనిని నుండి సులభంగా బయటపడాలంటే!

Suffering from overheating in the body? To get out of this easily!

Updated On : November 12, 2022 / 3:07 PM IST

Overheating : కాలంతో సంబంధం లేకుండా శ‌రీరంలో అధిక వేడితో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల‌, నీరు త‌క్కువగా తాగ‌డం వల్ల‌, త‌ర‌చూ ఆందోళ‌న‌కు గురి అవ్వ‌డం, థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలో వేడి ఎక్కువవుతుంది. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు, నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు ఒంట్లో వేడి చేయడం చూస్తూనే ఉంటాం.

శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉంటుంది. ఎండలో ఎక్కువ సమయం గడపడం వలన మీ శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. మహిళలకు మెనోపాజ్ వంటి పరిస్థితుల కారణంగా శరీర వేడి పెరగవచ్చు. కొన్ని రకాల మందులు శరీరంలో అధిక ఉష్ణ ఉత్పత్తికి కారణమవుతాయి, దీని వల్ల శరీర వేడి పెరుగుతుంది. శరీరంలో వేడి అధికమైతే మూత్రం లో మంట, మలబద్ధకం, క‌ళ్ళు మంట‌, క‌డుపు లో మంట‌, తలనొప్పి ,అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు మెడిసిన్‌‌పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య ను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను అనుసరించాలి. ఆహారపు అలవాట్లతో శరీరం లో ఉండే అధిక వేడిని తగ్గించవచ్చు.

1. తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. నీటిని అధికంగా తాగలేని వారు మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే వేడి తగ్గుతుంది.

2. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది.ఆసమయంలో ఫ్రిజ్ లో పెట్టిన తీసుకోకుండా సాధారణ నీటిని తీసుకోవాలి. వేడిని తగ్గించడం లో నీరు బాగా ఉపకరిస్తుంది.

3. ఉద‌యాన్నే గ్లాసు నిమ్మ‌ర‌సం తాగితే ఒంట్లో వేడి త‌గ్గుతుంది. ఉప్పు, లేదా పంచ‌దార వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగాలి. దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్క‌లు వేసుకుని తాగితే వేడి నుండి బయటపడవచ్చు.

4. గ్లాసు పాల‌లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న‌ క‌లుపుకొని తాగితే వేడి త‌గ్గుతుంది. గ్లాసుడు పాల‌లో చెంచాడు తేనె క‌లుపుకొని తాగితే శ‌రీరం చల్లబడుతుంది. గంధం చ‌ల్ల‌ని నీరు, లేదంటే పాల‌తో క‌లిపి నుదుట‌కు రాసుకుంటే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.

5. కొన్ని బార్లీ గింజ‌లు వేడి నీళ్ళ‌లో కాచి, మ‌జ్జిగ వేసుకుని ప‌ల‌చ‌గా తాగితే వేడి త‌గ్గుతుంది. ఒక స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. మెంతులు మ‌న శ‌రీరంలోని వేడి నుండి ఉపశనమనం కలిగిస్తాయి.

6. కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికంగా ఉంటుంది. కర్బూజా పండు చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది

7.స్విమ్మింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, ఐస్‌ను రాస్తే వేడి నుండి ఉపశమనం లభిస్తుంది.

8. అలోవెరా జ్యూస్ చ‌ల‌వ చేస్తుంది దాని ఆకుల మ‌ధ్య ఉండే జెల్ ను తీసుకుని నుదుటికి రాసుకుంటే చ‌ల్ల‌గా హాయిగా ఉంటుంది. గ‌స‌గ‌సాలు వేడిని త‌గ్గిస్తాయి. కానీ, మోతాదు మించి తీసుకోవ‌ద్దు.