Sugarcane Juice : మూత్ర పిండాలు, కాలేయ ఆరోగ్యానికి చెరుకురసం!
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

Sugarcane Juice (1)
Sugarcane Juice : చెరుకురసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రపంచంలోనే చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం ఉంటుంది. చెరకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోపండుతుంది. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. చక్కెర అధికంగా కలిపిన శీతల పానీయాలనో, పండ్ల రసాలనో ఆశ్రయించే బదులు నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం తాగటం మంచిది. చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపు సంతరించుకుంటుంది. అలానే ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గుతాయి. చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయని అధ్యయనాల్లో తేలింది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.
బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త కణాలకు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. మూత్రపిండాలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపుతుంది. తద్వారా వేసవిలో చాలామందికి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపులో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.