Foods With Tea : టీ తో కలిపి ఈ ఆహారాలను తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం?

చాలా మంది చల్లని , వేడి ఆహారాలు కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. వేడి టీ తాగిన తర్వాత అరగంట పాటు చల్లగా ఏదైనా తినడం మానుకోండి.

Foods With Tea : టీ తో కలిపి ఈ ఆహారాలను తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం?

Taking these foods with tea? But be careful, the danger of health problems surrounds?

Updated On : November 11, 2022 / 9:48 AM IST

Foods With Tea : పనివత్తిడితో అలసిపోయి ప్రశాంతత కోసం చాలా మంది టీ తాగటాన్ని అలవాటుగా చేసుకుంటారు. దీనిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంతా చెప్తుంటారు. సామాన్యుడి నుండి పెద్ద స్ధాయి వరకు అందరూ టీని సేవిస్తుంటారు. శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. దీంతో ఎముకలు కూడా దృఢంగా మారతాయి. చాలా మంది ఉదయం లేవగానే టీ తప్పనిసరిగా తాగుతారు. అయితే టీతో పాటు కలిపి కొన్ని రకాల పదార్ధాలను తీసుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఒక్కోసారి బిస్కెట్లతో, మరికొన్ని సార్లు వేడి వేడి పకోడీలనో టీ తాగే ముందుగా తీసుకుంటుంటారు. టీతో పాటు ఏమి తినాలి , ఏమి తినకూడదు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టీతో కలిపి కొన్ని ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు.

టీ తో కలిపి తీసుకోకూడని పదార్ధాలు ;

1. నిమ్మకాయ : బరువు తగ్గడానికి లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిమ్మరసం మరియు టీ కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్ ఆహారాలు టీతో తినకూడదు.

2. శనగ పిండి : శనగపిండితో చేసిన పావ్ భాజీతో పాటు టీని ఏ మాత్రం సేవించకూడదు. చాలా మంది టీతో పాటు పావ్ భాజీని తినడానికి ఇష్టపడతారు. దీనివల్ల జీర్ణక్రయ సమస్యలు తలెత్తుతాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ రెండింటిని కలిపి తీసుకోకపోవడమే మంచిది.

3. పసుపు : టీ మరియు పసుపు రెండింటి యొక్క కలయిక అనేది సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్, మలబద్ధకం,అసిడిటీ సమస్యలు వస్తాయి. టీ సిప్ చేస్తున్నప్పుడు పసుపు మిక్స్ అయిన ఆహారాన్ని తీసుకోరాదు.

4. వేడి అల్పాహారాలు : చాలా మంది చల్లని , వేడి ఆహారాలు కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. వేడి టీ తాగిన తర్వాత అరగంట పాటు చల్లగా ఏదైనా తినడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను చెడుగా ప్రభావితం చేయడమే కాకుండా వికారం కూడా కలిగిస్తుంది.

5. పచ్చి ఉల్లిపాయలు : చాలా మందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయలను టీతో కలిపి తినడం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉల్లిపాయలతో పాటు గుడ్డు, సలాడ్ మరియు మొలకెత్తిన గింజలు టీతో తీసుకోవటం మంచికాదు.