Green ink signature : గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే గ్రీన్ ఇంక్ పెన్నుతో ఎందుకు సంతకం పెడతారో తెలుసా?
గెజిటెడ్ ఆఫీసర్లు గ్రీన్ కలర్ ఇంక్ పెన్‌తో సంతకం పెడతారు. వారు ప్రత్యేకంగా ఈ కలర్ వాడటం వెనుక ఏమైనా నియమాలు ఉన్నాయా? కారణం ఏంటి?

Green ink signature
Green ink signature : ఉపాధ్యాయులు ఎరుపు ఇంక్ పెన్నులను వాడతారు.. స్టూడెంట్స్ బ్లూ రంగు పెన్నులు వాడతారు. ఆకుపచ్చ ఇంక్ పెన్నులను గెజిటెడ్ ఆఫీసర్లకు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? దీనిపై ఆన్ లైన్‌లో కూడా చర్చ జరిగింది. గెజిటెడ్ ఆపీసర్లు మాత్రమే గ్రీన్ ఇంక్ పెన్ను ఎందుకు వాడతారంటే?
NMMS Scholarship : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తుల ప్రారంభం
ఇండియాలో ఆకుపచ్చ సిరా ఉపయోగించేందుకు ఎటువంటి ప్రోటోకాల్ కానీ, చట్టం కానీ లేదు. ఇది కేవలం ఆఫీస్ హెడ్ తన ర్యాంక్ కంటే తక్కువ అధికారి నుండి వేరు చేయడానికి ఈ రంగు సిరాని ఎంపిక చేసుకుంటారట. ఆకుపచ్చ ఇంక్ పెన్నులను ఉపయోగించడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే? ఎవరైనా కార్యాలయంలో వారి సంతకాన్ని కాపీ చేయడం కష్టం. ఆకుపచ్చ సిరా సంతకాలు ప్రత్యేకతను, ప్రామాణికతను కలిగి ఉంటాయని అయినా అవి ఫోర్జరీ అయ్యే అవకాశం ఉందని ఆన్ లైన్ చర్చలో చాలామంది అభిప్రాయపడ్డారు.
సాంకేతిక సిబ్బంది, భోదనా సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది. గ్రంథాలయ సిబ్బందికి కూడా గెజిటెడ్ హోదా ఉంది. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉంటే ఇప్పుడు స్కూలు హెడ్ మాస్టర్, గవర్నమెంట్ డాక్టర్ వంటి వారు కూడా గెజిటెడ్ ఆఫీసర్లు అయ్యారు. వీరు వివిధ అప్లికేషన్ల కోసం సమర్పించిన పత్రాలు అసలైన కాపీగా ధృవీకరించే బాధ్యతను కలిగి ఉంటారు. ఒకప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లు ఎరుపురంగు వాడేవారట. ఇప్పుడు కొందరు ఐఏఎస్‌లు మామూలు రంగు పెన్నులే వాడుతున్నారు. ప్రభుత్వం ఫలానా రంగు ఇంకు పెన్నులతో సంతకం పెట్టాలని ఎటువంటి నియమాలను మాత్రం విధించలేదు.