Potatoes : ఆలుగడ్డతో ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే అస్సలు వదలిపెట్టరు

ఒక్కో సందర్భంలో పొయ్యి మీద పాత్రలు పెట్టి మర్చిపోతుంటాం. ఇలా చేయటం వల్ల పాత్రలు మాడిపోయి నల్లగా తయారవుతుంటాయి. అలాంటప్పుడు బంగాళ తుంప ముక్కను నిమ్మరసంలో ముంచి అడుగంటి మాడిపోయిన నల్

Potatoes : ఆలుగడ్డతో ఇన్ని ప్రయోజనాలా… తెలిస్తే అస్సలు వదలిపెట్టరు

Potato

Updated On : August 27, 2021 / 12:18 PM IST

Potatoes : దుంపజాతికి చెందిన కూరగాయల్లో బంగాళ దుంప ఒకటి. దీనిని ఆలుగడ్డ, ఉర్లగడ్డ, పొటాటో అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఇందులో పిండిపదార్ధం అధికంగా ఉంటుంది. విటమిన్ సి, పొటాషియం, బి6, థయామిన్, రైబోప్లావిన్, ఫొలేట్,నియాసిన్, మెగ్నీషియం,ఐరన్, జింక్ వంటి పదార్ధాలు బంగాళదుంపను తీసుకోవటం ద్వారా లభిస్తాయి. బంగాళ దుంపను కూరగాయగా ఆహారంలో భాగం చేసుకోవటమే కాకుండా దీని వల్ల ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా తుప్పుపట్టిన స్టీలు, ఐరన్ పాత్రలను తిరిగి సహజ సిద్ధంగా మార్చటంలో బంగాళ దుంప బాగా పనిచేస్తుంది. మందపాటి సైజులో బంగాళ దుంప ముక్కను కట్ చేసి, సోప్ లిక్విడ్ లో ముంచి తుప్పు పట్టినపాత్రలపై రుద్దితే క్షణాల్లోనే తుప్పు తొలగిపోతుంది. వంటకు ఉపయోగించే కత్తులు వంటివి తుప్పు పట్టిన పక్షంలో తుప్పును వదిలించుకునేందుకు బంగాళ దుంప ముక్కను వాటిపై రుద్ది 5నిమిషాలు ఉంచాక నీటితో కడగాలి.

వెండి ఆభరణాలు వంటివి కొన్నాళ్ళకు నల్లబడి పోతుంటాయి. వాటిని తిరిగి తెల్లగా మార్చటం కోసం నీటిలో వేసి షాంపు, కుంకుడుకాయ రసంతోనే కడుగుతుంటాం. అయితే అవి శుభ్రంగా తెల్లగా నిగనిగ మెరవాలంటే బంగాళ దుంపలు ఉడకించిన నీళ్ళల్లో వెండి వస్తువుల్ని కాసేపు ఉంచి తరువాత బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్ల బడ్డ వెండి వస్తువులు తళతళ మెరుస్తాయి.

ఒక్కో సందర్భంలో పొయ్యి మీద పాత్రలు పెట్టి మర్చిపోతుంటాం. ఇలా చేయటం వల్ల పాత్రలు మాడిపోయి నల్లగా తయారవుతుంటాయి. అలాంటప్పుడు బంగాళ తుంప ముక్కను నిమ్మరసంలో ముంచి అడుగంటి మాడిపోయిన నల్లని ప్రదేశాల్లో రుద్దాలి. అరగంట సమయం తరువాత వాటిని తిరిగి సబ్బునీటితో రుద్దితే తిరిగి మెరుపుదనం సంతరించుకుంటాయి.

ఇంట్లో ఉండే డ్రస్సింగ్ మిర్రర్లు, గ్లాస్ కిటికీలు, కళ్ళద్దాలు మసకబారిపోయినట్లు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని శుభ్రం చేయటానికి బంగాళదుంప ముక్కను తీసుకుని రుద్దితే సరిపోతుంది. దుంపలోని స్టార్చ్ అద్దాలు మసకబారకుండా చేయటంలో దోహదం చేస్తాయి. దుస్తులపై పడే మరకలు తొలగించటం అంటే చాలా కష్టం. అయితే అలాంటి మరకలను బంగాళ దుంప త్వరగా తొలగించేస్తుంది. ఉడికించిన బంగాళ దుంప ముక్కను దుస్తులపై మరకలు ఉన్న చోట రుద్ది అరగంటపాటు అలా ఉంచాక సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి.

చెక్కవస్తువులు, లెదర్ బ్యాకులు, తదితర వస్తువుల్ని శుభ్రం చేసుకునేందుకు బంగాళ దుంపబాగా పనిచేస్తుంది. బంగాళ దుంపముక్కలకు వెనిగర్, టీ స్పూన్ ఉప్పు, చేర్చి స్పాంజితో ఫర్నీచర్ పై రుద్దితే అవి తిరిగి కాంతివంతంగా మారతాయి.