Carbohydrates : శరీరానికి తగినంత కార్బోహడ్రేట్స్ అందించకపోతే జరిగే పరిణామాలు ఇవే!
తక్కువ కార్బ్ ఆహారం వల్ల శరీరం కీటోన్‌లుగా విడిపోవడానికి కారణమవుతాయి. శరీరం కీటోసిస్ స్థితికి వెళుతుంది. ఇది తలనొప్పి, అలసట, బలహీనత వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పికి దారి తీస్తుంది. ఆహార విధానంలో మార్పులు పేగు సమస్యలని తీసుకొస్తాయి.

Carbohydrates :
Carbohydrates : అధిక బరువు సమస్య కారణంగా ఇటీ వలి కాలంలో తిండి మానేయటం ఫ్యాషన్ గా మారిపోయింది. ముఖ్యంగా బరువు పెరగటానికి కార్బోహైడ్రేట్సే కారణమన్న తలంపుతో అసలు వాటిని తినటమే మానేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ వైద్యుని సలహా లేకుండా వాటిని పరిమితి కంటే ఇంకా తక్కువ తీసుకోవడం అసలు మంచిదికాదు.
శరీరానికి ప్రధాన వనరు కార్బోహైడ్రేట్స్. మెదడు, కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు కోసం శరీరం కార్బోహైడ్రేట్స్ ని శక్తిగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్స్ ను తగ్గించి తీసుకోవటం వల్ల వాటిపై ప్రభావం పడుతుంది. అనార్థాలు తీసుకొచ్చి పెడుతుంది. రోజుకు మనిషికి 2000 కేలరీలు అవసరం అవుతాయి. కానీ వాటిని మరింత తగ్గించి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి.
తక్కువ కార్బ్ ఆహారం వల్ల శరీరం కీటోన్‌లుగా విడిపోవడానికి కారణమవుతాయి. శరీరం కీటోసిస్ స్థితికి వెళుతుంది. ఇది తలనొప్పి, అలసట, బలహీనత వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పికి దారి తీస్తుంది. ఆహార విధానంలో మార్పులు పేగు సమస్యలని తీసుకొస్తాయి. అందువల్ల దీర్ఘకాలికంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అందుకు కారణం సరిపడినంత ఫైబర్ తీసుకోకపోవడమే అని వైద్యులు చెబుతున్నారు.
తక్కువ కార్బ్ ఆహారం కారణంగా శరీరంలో గ్లైకోజెన్ ఎక్కువగా ఉత్పత్తి మందగిస్తుంది. దాని వల్ల శక్తి స్థాయిలు తగ్గిపోతాయి అలసటకి కారణం అవుతుంది. దీని వల్ల శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన ఖనిజాలని ఆహారంలో సరిగా పొందకపోతే శరీర కండరాలు తిమ్మిరి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. పొటాషియం, ఉప్పు, మెగ్నీషియం కండరాల సంకోచానికి ఉపయోగపడుతుంది. మూత్రవిసర్జన, ఉచ్ఛ్వాసానికి సంబంధించిన అనేక ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను నియంత్రిస్తాయి.తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. శరీరంలో గ్లైకోజెన్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. శక్తి కోసం కీటోన్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది.