Liver Health : లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే!
ఆహారంతో పాటు బీట్ రూట్ జ్యూ తీసుకోవటం చాలా ఉత్తమం. ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కాలేయం, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం వలన శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
Liver Health : కాలేయం శరీరంలో అతిపెద్ద అవయవం. ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. శరీరంలోని మలినాల వడపోత, ఆహారం జీర్ణక్రియ, ప్రోటీన్ సంశ్లేషణ, శరీరంలో వివిధ అవసరాల కోసం విటమిన్లు, ఖనిజాల నిల్వ చేయటంలో కాలేయం ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఆహరపు అలవాట్లు, అనుసరించే జీవనశైలి కాలేయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం సరైన ఆహారాన్ని రోజువారిగా తీసుకోవాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. హెర్బల్ టీ ; హెర్బల్ టీలు తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది, కాలేయ కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. రోజూ బ్లాక్ టీ, గ్రీన్ టీ తాగడం వల్ల లివర్ నుంచి ఎంజైమ్ స్రావాలు పెరుగుతాయి. లివర్ లో ఫ్యాట్ లెవల్స్ తగ్గుతాయి. ఇలాంటి టీలలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు, పలు రకాల క్యాన్సర్లను కూడా నివారించవచ్చు. కాఫీ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అత్యుత్తమ పానీయాలలో కాఫీ ఒకటి. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీ తాగవచ్చు. ఇది సిర్రోసిస్, లివర్ డ్యామేజ్, లివర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.
2. ద్రాక్ష ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజంగా కాలేయాన్ని రక్షిస్తాయి. కాలేయ కణాలను బాగు చేయడంలో సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం, ద్రాక్షపండులోని పోషకాలు హెపాటిక్ ఫైబ్రోసిస్ సమస్యను నివారిస్తుంది. దీనివలన కాలేయానికి హాని కలిగించే కణజాలాల అభివృద్ధి జరగదు. దీనిలో ఉండే రెస్వెరాట్రాల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయంలో మంటను తగ్గించడం, కాలేయం దెబ్బతినకుండా నిరోధించడం, యాంటీఆక్సిడెంట్ స్థాయిలని పెంచడం చేస్తుంది.
3. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే కొవ్వు చేపలను ఆహారంలో తీసుకోవటం వలన అది కాలేయంపై కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం, కొవ్వు చేపలు కాలేయంలో కొవ్వు , ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి. కొవ్వు చేపల్లో ఉండే పోషకాలు సహజంగా కణాలను రిపేర్ చేస్తాయి. శరీరంలో మంట, వేడిని తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కొవ్వు చేపలలో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి వాపును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా -3 అధికంగా ఉండే కొవ్వు చేపలను తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది.
4. బీట్రూట్ జ్యూస్ ; ఆహారంతో పాటు బీట్ రూట్ జ్యూ తీసుకోవటం చాలా ఉత్తమం. ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కాలేయం, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం వలన శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో ఎంజైమ్‌ల ఉత్పత్తిని సహజంగా పెంచడంలో సహాయపడుతుంది, మలినాలను తొలగిస్తుంది. ఈ క్రమంలో కాలేయంపై భారం తగ్గి దాని పనితీరు మెరుగవుతుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచిది. రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించటం కాలేయం దెబ్బతినడానికి అతిపెద్ద కారణం. అధిక బరువు, మధుమేహం, హెపటైటిస్ బి, సి సమస్యల వలన కూడా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి ఆహారం తీసుకుంటూ, రోజు వారి వ్యాయామాలు చేయటం ద్వారా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.