Boost Immunity In Winter : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేసే ఆహారాలు ఇవే!
చలికాలంలో సూప్స్ తాగటం వల్ల ఉపశమనం దక్కుతుంది. కారం ఉండే ఆహారం తినటంతోపాటు మాంసాహారం , చేపలు శరీరానికి అదనంగా శక్తిని అందిస్తాయి.

Boost Immunity In Winter :
Boost Immunity In Winter : చలికాలంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి వీటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవటం ఒక్కటే మార్గం. వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే అందుకు తగిన పోషకాహారాన్ని రోజువారిగా తీసుకోవాలి. చలికాలంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారాలపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం ;
1. రోగ నిరోధకశక్తి పెంచుకోవటం కోసం పిస్తా, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఫల్లీలు , ఖర్జూరాలు తినాలి. బెల్లంతో చేసిన చెక్కీలు, బెల్లం రొట్టెలు, నెయ్యి, బెల్లం కలగలిపిన చెక్కీలు తీసుకోవాలి.
2. చలికాలంలో సూప్స్ తాగటం వల్ల ఉపశమనం దక్కుతుంది. కారం ఉండే ఆహారం తినటంతోపాటు మాంసాహారం , చేపలు శరీరానికి అదనంగా శక్తిని అందిస్తాయి.
3. కూరల్లో అల్లాన్ని వాడుకోవాలి. అల్లం టీ రోజువారిగా తాగాలి. దీని వల్ల యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
4. బొప్పాయి పండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల యాంటీ ఇన్ ఫ్లెమెటరీ గుణాల వల్ల వ్యాధినిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఉదయాన్నే బొప్పాయి ముక్కలు తినటం వల్ల బరువు సైతం తగ్గవచ్చు.
5. బ్యాక్టీరియా, వైరల్, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే సిట్రస్ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లను తినటం మంచిది.
6. మకాన్, ఉలవలు, నువ్వులతో చేసిన ఆహారం తినటం మంచిది. ఇవి శరీరం చల్లగా కాకుండా వెచ్చగా ఉంచుతాయి.
7. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలతో చేసిన ఆహారం తినటం వల్ల పిండి పదార్ధాలు అందటంతోపాటు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి.