Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ స్ధాయిలు తగ్గించే జ్యూస్ లు ఇవే!

ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఆగి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల ఎముకలు దెబ్బతింటాయి.

Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ స్ధాయిలు తగ్గించే జ్యూస్ లు ఇవే!

Uric Acid

Updated On : July 12, 2022 / 3:12 PM IST

Uric Acid : యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిని బాధిస్తోంది. యూరిక్ యాసిడ్ అనేది తిన్న ఆహారాన్ని జీర్ణాశయం జీర్ణం చేసిన తరువాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. ఇది మూత్ర పిండాల ద్వారా మూత్రంలో చేరి తరువాత బయటకు వెళుతుంది. యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగితే పలు సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో మోతాదుకు మించి ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు ఉత్పనం అవుతాయి.

ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఆగి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల ఎముకలు దెబ్బతింటాయి. గౌట్ సమస్య వస్తుంది. శరీరంలో అధిక మొత్తం ఉండే యూరిక్ యాసిడ్ ను
బయటకు పంపటానికి కొన్ని ఆయుర్వేద విధనాలు బాగా ఉపయోగపడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

సొరకాయ, వాము, మిరియాల యూరిక్ యాసిడ్ ను బయటకు పంపటంలో బాగా ఉపయోగపడతాయి. ఇందుకుగాను ముందుగా వామును దంచి పొడిగా తయారు చేసుకోవాలి. సొర కాయ చెక్కును తీసి ముక్కలుగా కోసి జ్యూస్ చేసుకోవాలి. ఒక స్పూను వాము పొడిని, ఒక స్పూను
మిరియాల పొడిని అందులో వేసుకోవాలి. ఉదయాన్ని అల్పాహారం తీసుకున్న తరువాత దీనిని తాగితే యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లిపోయి గౌట్ సమస్య తగ్గుతుంది. కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి తిప్పతీగ మంచి ఔషధంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక తిప్పతీగ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మరుసటి రోజు ఉదయం ఆకులతో సహా ఈ నీటిని మరిగించాలి. మరగించిన నీటిని వడగట్టి తాగాలి. ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.