Blocking people : ఫ్రెండ్స్‌ని బ్లాక్ చేస్తున్నారా? చేసేముందు ఆలోచించండి
ఒకరిని మీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బ్లాక్ చేస్తున్నారు అంటే.. ఇక వారిని మీరు పూర్తిగా వద్దనుకున్నట్లే. మనకు ఇబ్బంది కలిగించే కొన్ని బంధాల నుంచి బయటకు రావాలంటే బ్లాక్ చేయడం సరైనదే.. కానీ కోపంలో, ఆవేశంలో మంచి మిత్రులను బ్లాక్ చేసి అవమానిస్తే జీవితంలో కొన్ని బంధాలను కావాలని బ్రేక్ చేసుకున్నట్లే.

Blocking people social media
Blocking people : ఒక వ్యక్తి స్నేహం, లేదా ప్రేమ నచ్చకపోతే వారిని దూరం చేసుకోవడం ఎలా? ఒక వ్యక్తి వల్ల జరిగే నష్టం, ఎదురైన కష్టం మర్చిపోవడం ఎలా? సింపుల్లా వారిని బ్లాక్ చేయడమేనా? బ్లాక్ చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా?
Friendships on social media : సోషల్ మీడియా స్నేహాలు సేఫేనా? వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటే అంతే..
చేతిలో సెల్ ఫోన్ లేని వ్యక్తులు అసలు ఉన్నారా? ఫోన్ లేకుండా కాసేపు ఉండగలరా? నో.. వే.. ఫోన్ చేతిలో లేకపోతే బుర్ర పనిచేయనంతగా అందరూ ఎడిక్ట్ అయిపోయారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమందితో పరిచయాలు, స్నేహాలు. సోషల్ మీడియా మంచికి మంచి, చెడుకి చెడు తెచ్చిపెడుతుంది. దాన్ని మనం ఉపయోగించుకునే తీరును బట్టి ఫలితం చూపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో స్నేహాలు, ప్రేమలు, బ్రేకప్‌లు కోకొల్లలు. ముఖ పరిచయం ఉన్న వారితోనే ఎన్నో సమస్యలు వచ్చిపడుతుంటే.. కంటికి కనిపించని వారితో స్నేహాలు ఎంతవరకూ సేఫ్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందే.
సోషల్ మీడియా అనే మహా సముద్రంలో రోజు రకరకాల వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం. కొందరు స్నేహ హస్తం అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తరువాత తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. కొద్దిరోజులు మనల్ని పొగిడినవారే ఆ తరువాత మాటల దాడికి దిగుతారు. మన పోస్టులు చూసి ఓర్వలేని వారు ఉంటారు. అనవసరంగా తిడుతూ కామెంట్లు పెట్టేవారు ఉంటారు. మన ఖాతాల్లోకి వచ్చి ఇతరులతో మనకున్న మంచి స్నేహాల్ని చెడగొడుతూ ఆరోగ్యకరంగా ఉన్న వాతావరణాన్ని స్పాయిల్ చేస్తారు. మనకు సంబంధించిన అన్ని విషయాల్ని వ్యతిరేకిస్తుంటారు. అలాంటి వారిని అదుపులో పెట్టాలంటే దూరం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా మన చేతిలో ఉండే ఆయుధం బ్లాక్ చేయడం.
సోషల్ మీడియా అనుబంధాలతో జాగ్రత్త..
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని ఇబ్బంది పెట్టడం కోసం కొందరు వారి పేరుతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేస్తుంటారు. వారి పేరుతో డబ్బులు అడగడం లేదంటే అభ్యంతరకరంగా మాట్లాడటం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వారిపై ఖచ్చితంగా రిపోర్ట్ చేయడం లేదంటే బ్లాక్ చేయడం ఉత్తమం. ఒకప్పుడు స్నేహితులైనా, బంధువులైనా ఏదైనా అంటే గొడవలు పడేవారు. అరుచుకునేవారు.. ఇప్పుడు సింపుల్‌గా బ్లాక్ బటన్ నొక్కి దూరం పెట్టేస్తున్నారు. నువ్వు నచ్చలేదు.. నీతో అవసరం లేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు.
కొందరు బ్లాక్ చేస్తుంటారు.. అన్ బ్లాక్ చేస్తుంటారు. అవతలి వారితో స్నేహం, ప్రేమ అనే అంశాల్లో రిలేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోతారు. ఈ పరిస్థితి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీకు హాని కలిగించిన.. బాధించిన బంధాల నుంచి బయటపడాలనే బలమైన నిర్ణయం తీసుకుంటేనే బ్లాక్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైనదని సూచిస్తున్నారు. లేదంటే ఒత్తిడికి లోనవడం .. డిప్రెషన్‌కి వెళ్లడం లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
మీ పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?
మనకి నచ్చని వ్యక్తుల్ని సింపుల్గా సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం సులభమైపోయింది. అయితే బ్లాక్ చేయగానే అందరూ దానిని అంత ఈజీగా తెలుసుకోలేరు. కొందరు దానిని చాలా అవమానంగా భావిస్తారు. బ్లాక్ చేయడం అంటే అవతలి వ్యక్తిని తమ జీవితం నుంచి దూరం పెట్టినట్లే. కొందరిలో బ్లాక్ చేయడం అనేది ఒక రకమైన వీక్ నెస్ గా చెప్పాలి. వారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక బ్లాక్ చేస్తుంటారు. కొందరు అనాలోచితంగా కోపంలో తొందరపడి స్నేహితుల్ని బ్లాక్ చేస్తుంటారు. కోపం తగ్గగానే గిల్టీగా ఫీలై అన్ బ్లాక్ చేస్తుంటారు. బ్లాక్ చేయడం.. అన్ బ్లాక్ చేయడం ఒక ఆటలాగ సాగితే ఇతరులకు మీమీద నమ్మకం పోతుంది. మీ మధ్య దూరం పెరిగిపోతుంది. మంచి స్నేహం మధ్య బ్లాక్ చేయడం అనేది బ్రేకప్‌కి దారి తీసిన ఆశ్చర్యం లేదు.
కొందరు ప్రేమలో విఫలమై బ్లాక్ చేస్తుంటారు. వీరి విషయంలో ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం మంచిదే అని చెప్పాలి. వారు కలిసున్నప్పటి సంఘటనలు గుర్తొచ్చి ఇబ్బంది పడకుండా వాటిని మర్చిపోవడానికి ఇది సహకరిస్తుంది. ఒకరి అకౌంట్స్ మరొకరికి కనిపిస్తున్నంత సేపు గతం గాయం చేస్తూ ఉంటుంది. దాని కంటే ఒకరినొకరు మర్చిపోవాలంటే బ్లాక్ చేయడం బెటర్. అయితే ఒకరిని బ్లాక్ చేసేముందు ఆవేశంలో.. కోపంలో.. తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోకుండా కాస్త టైం తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కోల్పోయిన స్నేహమైనా.. ప్రేమైనా తిరిగి రాదు. బ్లాక్ బటన్ నొక్కి తలుపులు మూసేస్తే అవి ఇంక ఎప్పటికీ తెరుచుకోవు. మీ బంధాలు నిలబెట్టుకోవాలన్నా.. తెగ్గొట్టుకోవాలన్నా బ్లాక్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి.