Prevent Dengue : పనిచేసే కార్యాలయంలో డెంగ్యూ రాకుండా నివారించేందుకు అనుసరించాల్సిన చిట్కాలు !

కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చిందరవందరగా ఉంచరాదు. ఏదైనా చెత్త ఉంటే దానిని తొలగించుకోవాలి. ఎందుకంటే అవి దోమలకు నిలయమై సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారతాయి.

Prevent Dengue : పనిచేసే కార్యాలయంలో డెంగ్యూ రాకుండా నివారించేందుకు అనుసరించాల్సిన చిట్కాలు !

prevent dengue in the workplace

Updated On : July 11, 2023 / 8:47 AM IST

Prevent Dengue : వర్షాకాలంలో డెంగ్యూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన వైరస్ క్యారియర్‌ ను నివారించాలంటే దోమల సంతానోత్పత్తి అనుకూల ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి.

READ ALSO : డెంగ్యూతో బాధపడేవారు ఈ ఆహారాల జోలికి వెళ్లొద్దు!

ప్రజలు సాధారణంగా బయట వాతావరణంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇంటి లోపల ఉన్నప్పుడు దోమల కాటు నుండి సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. అయితే, దోమలు ఎక్కడైనా సంతానోత్పత్తి చేస్తాయి. వీటికి కార్యాలయాలు ఏమీ మినహాయింపు కాదు. ఎయిర్ కండిషనర్లు, డ్రైనేజీలు, టాయిలెట్ బౌల్స్, పార్కింగ్ ప్రాంతాలు అన్నీదోమల సంతానోత్పత్తి ప్రదేశాలు. అలాగే, చాలా కార్యాలయాల్లో వెంటిలేషన్ లేకపోవడం వల్ల డెంగ్యూ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.

డెంగ్యూ వ్యాప్తిని తగ్గించడానికి దోమల నియంత్రణ, ఇన్ఫెక్షన్ నివారణ చర్యలు చేపట్టాలి. ఉద్యోగులలో వ్యాధి సంకేతాలు, లక్షణాలపై అవగాహన పెంపొందించాలని, డెంగ్యూ నివారణకు మంచి పద్ధతులను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO :  Good Mosquitoes : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి

కార్యాలయంలో డెంగ్యూ నివారణకు చిట్కాలు

1. దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను నివారించాలి : ఫ్లవర్‌పాట్‌లు, కుండీలు, బకెట్‌లు లేదా కంటైనర్‌లు వంటి నీటి నిల్వ ఉండే ప్రదేశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. దోమలకు నిలమై ఉంటే ఆ నీటి వనరులను ఖాళీ చేయాలి, శుభ్రం చేయాలి. దోమలు వృద్ధి చెందకుండా కవర్ చేయాలి.

2. పరిశుభ్రతను కాపాడుకోండి: కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చిందరవందరగా ఉంచరాదు. ఏదైనా చెత్త ఉంటే దానిని తొలగించుకోవాలి. ఎందుకంటే అవి దోమలకు నిలయమై సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారతాయి.

READ ALSO : Monsoon Season Health Tips : వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు !

3. విండో, డోర్ స్క్రీన్‌లను ఏర్పాటు : కార్యాలయంలోకి దోమలు రాకుండా కిటికీలు , తలుపులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. వాటికి దోమల మెష్ లను, కర్టెన్లను ఏర్పాటు చేసుకోవాలి.

4. దోమల వికర్షకాలను ఉపయోగించండి: DEET, పికారిడిన్ ఇతర సిఫార్సు చేసిన దోమల వికర్షకాలను ఉపయోగించమని ఉద్యోగులను ప్రోత్సహించాలి. అవసరమైతే వాటిని వారికి అందుబాటులో ఉంచాలి. దోమ కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి రక్షిత దుస్తులు ధరించండి.

5. అవగాహన పెంపొందించుకోండి: డెంగ్యూ నివారణ చర్యలు, లక్షణాలు ముందస్తుగా గుర్తించడం , వైద్య సహాయం పొందటం యొక్క ప్రాముఖ్యత గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించడానికి అవగాహన ప్రచారాలు , శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

READ ALSO : Papaya : జీర్ణక్రియను మెరుగుపరచటంలో అద్భుతంగా ఉపయోగపడే పచ్చిబొప్పాయి?

డెంగ్యూ నివారణ అనేది సమిష్టి కృషి అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ నివారణ చర్యలను అమలు చేయడంలో ఉద్యోగులు, మేనేజ్‌మెంట్ భాగస్వాములు కావటం ఎంతైనా అవసరం. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా కార్యాలయ వాతావరణాన్ని డెంగ్యూరహితంగా సృష్టించవచ్చు. డెంగ్యూ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.