Milk Prevent : పాలు త్వరగా విరగకుండా ఉండాలంటే?..
పాలు వేడిచేసేప్పుడే అందులో ఓ చిటికెడు సోడా వేయాలి. ఇలా చేయటం వల్ల త్వరగా పాలను తర్వగా విరిగిపోకుండా చూసుకోవచ్చు.

Milk (1)
Milk Prevent : పాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. అయితే పాలను ఎక్కవ కాలం నిల్వ ఉంచటం చాలా మందికి పెద్ద సమస్య. పాలను తీసుకొచ్చిన తరువాత వాడుకోకుండా అలా ఉంచితే అవి విరిగిపోయేందుకు అస్కారం ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల పాలు త్వరగా విరిగిపోతాయి. వేడి ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు పీహెచ్ స్ధాయి తగ్గటంతో ఆమ్లంగా మారి పాలు విరిగిపోతాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో ఈ తరహా పరిస్ధితిని చాలా మంది తమ ఇళ్లల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలను తీసుకువచ్చిన నాలుగు గంటల వ్యవధిలో మరిగించాలి. లేకపోతే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవాలి. ఫ్రిజ్ లో తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచిన పాలు త్వరగా విరిగిపోవు. లేకపోతే త్వరగా విరిగిపోతాయి. ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో పాలను ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ విరిగిపోతుంటాయి. ఇక ఫ్రీజ్ లేని వాళ్ల పరిస్ధితి చెప్పనక్కర్లే వాటిని నిల్వ చేసుకోవటం వారికి ఒకింత ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే పాలు త్వరగా విరగకుండా జాగ్రత్తపరచుకోవచ్చు.
పాలు వేడిచేసేప్పుడే అందులో ఓ చిటికెడు సోడా వేయాలి. ఇలా చేయటం వల్ల త్వరగా పాలను తర్వగా విరిగిపోకుండా చూసుకోవచ్చు. విరిగిపోయేందుకు సిద్దంగా ఉన్న పాలు సైతం ఇలా చేయటం వల్ల తాజాగా అవుతాయి. పాడవకుండా ఫ్రిజ్ లో నిల్వ చేసిన పాలను తిరిగి వేడి చేయాలనుకున్నప్పుడు నేరుగా పొయ్యిమీద పెట్టకూడదు. ఖాళీ గిన్నెను పొయ్యి మీద ఉంచి దాని లోపల పాల గిన్నెను పెట్టిన సన్నటి మంటపై వేడి చేయాలి.
పాలు తెచ్చిన వెంటనే కాగబెట్టుకోవాలి. ఒక్క పొంగుతో పోయ్యి కట్టేయకుండా, రెండు, మూడు పొంగులు వచ్చేవరకూ కాగనివ్వాలి. కాచిన పాలను వాడుకోగా మిగిలిన వాటిని చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. తరుచూ పాలను గిన్నెల్లోకి మార్చటం వంటివి చేయకూడదు. ఒకవేళ మార్చవలసి వస్తే మార్చే గిన్నెను ముందుగా వేడి నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల పాలు విరిగిపోయేందుకు అవకాశం ఉండదు.