Triplet Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్లు… ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు..!

ఒకే తల్లి పిల్లలు.. నాలుగు నిమిషాల వ్యవధిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు జన్మించారు.. ఇప్పుడా తోబుట్టువులు ఒకే సమయంలో ప్రెగ్నెంట్ అయ్యారు. కొన్ని నెలల్లో ఈ ముగ్గురు.. మరో ముగ్గురు బేబీలకు జన్మనివ్వబోతున్నారు.

Triplet Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్లు… ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు..!

Triplet Sisters All Fall Pregnant At The Same Time

Updated On : June 25, 2021 / 8:11 PM IST

Triplet Sisters : ఒకే తల్లి పిల్లలు.. నాలుగు నిమిషాల వ్యవధిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు జన్మించారు.. ఇప్పుడా తోబుట్టువులు ఒకేసారి తల్లియ్యారు. కొన్ని నెలల్లో ముగ్గురూ  బేబీలకు జన్మనివ్వబోతున్నారు. ఎల్ఏ, ఆరెంజ్ కౌంటీకి చెందిన 35 ఏళ్ల ముగ్గురు  అక్కాచెల్లెళ్లు.. జినా, నినా, విక్టోరియా.. ప్రపంచంలోకి తమ బేబీలకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. తమకు పుట్టబోయే వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప పుడుతుందని ఆశపడుతున్నారు. జూలై, ఆగస్టు లేదా నవంబర్ నెలలో డెలవరీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ రోజు కోసం చాలా ఆనందంతో ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.

ఈ ముగ్గురిలో నినా ముందుగా తల్లి అయింది. ఆ తర్వాత జినా, విక్టోరియా తల్లయ్యారు. తాను నాలుగు నిమిషాలు లేటుగా పుట్టానని, తనకు పాపే పుడుతుందని అంటోంది. ఆ పాప పేరు Leighton Grace కూడా ముందే పెట్టేసుకుంది. ఇక నినా.. కూడా తనకు పుట్టబోయే బాబు పేరు కూడా ముందే ఎంచుకుంది. తాను నాలుగు నిమిషాల మధ్య పుట్టానని, తనకు బాబే పుడతాడని చెబుతోంది. అలాగే అతడు పేరు Hendrix Paul పెడతానంటోంది. ఇక విక్టోరియా కూడా తనకు బాబు పుడతాడని అంటోంది.

బాబు పేరు.. Zaden Seth పెడతానని చెబుతోంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముగ్గరూ ఒకే మెటిర్నిటీ మ్యాచింగ్ దుస్తులు ధరించి తమ మాతృఅనుభూతిని ముందునుంచే ఆశ్వాదిస్తున్నారు. మెమోరియల్ కేర్ శాడిల్ బ్యాక్ మెడికల్ ఆస్పత్రిలో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు డెలవరీ కాబోతున్నారు.