Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే?

అల్పాహారానికి , బోజనానికి మధ్య సమయంలో ఏదైనా చిరుతిండి తినాలని అనిపిస్తే బాదంపప్పు, కాజు, పిస్తా వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే?

Cholesterol

Bad Cholesterol : ప్రతి మనిషి శరీరానికి నిర్ణీత మోతాదులో కొలెస్ట్రాల్ స్ధాయిలు అవసరం. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికమైతే మాత్రం ప్రమాదఘంటికలు మోగుతాయి. ముఖ్యంగా ఈ ప్రభావం గుండె రక్తనాళాల్లో పూడికలకు దారితీస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించటానికి దోహదపడతాయి.

బరువు పెరగటం, ఊబకాయంతో బాధపడుతున్న వారిలో కొలెస్ట్రాల్ స్ధాయిలు మోతాదుకు మించి ఉంటాయి. దీని వల్ల అలాంటి వారు రక్తపోటు, మదుమేహం వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. రక్తనాళాల గోడలు దెబ్బతిని బ్లాక్స్ ఏర్పడి గుండె పోటుకు తద్వారా అకస్మిక మరణాలకు దారి తీస్తాయి. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిత్యం అదుపులో ఉండేలా చూసుకోవటం అవసరం.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు తినే ఆహారంతోపాటు, జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా సులభంగా కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించుకోవచ్చు. రోజు ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టు తీయని ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన బావన కల్పిస్తాయి. రక్తనాళాల్లో పూడికలను నివారిస్తాయి.

అల్పాహారానికి , బోజనానికి మధ్య సమయంలో ఏదైనా చిరుతిండి తినాలని అనిపిస్తే బాదంపప్పు, కాజు, పిస్తా వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీటిల్లో ఉండే కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి. పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆలివ్ నూనెల వంట అసంతృప్త కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మాంసం, వెన్న తీయని పాలు, పామాయిల్, వెన్న వంటివి చెడు కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి.

ఒత్తిడి తగ్గించుకోవటం అందుకోసం నలుగురితో సరదాగా గడపటం, రోజుకు గంటసమయం వ్యాయామానికి కేటాయించాలి. తద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. శరీరం చెమటపట్టేలా శారీర వ్యాయామాలు చేయటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతాయి. బరువు, ఊబకాయం తగ్గించుకోవచ్చు.