Vitamin Supplements : విటమిన్ మాత్రలు తీసుకునే విషయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే?

పెద్ద మొత్తంలో పోషకాలకు సంబంధించి మందులు వేసుకుంటే వాటిని శరీరం గ్రహించే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి వాటిని కలిపి ఒకేసారి వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు.

Vitamin Supplements : విటమిన్ మాత్రలు తీసుకునే విషయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే?

vitamin supplements

Updated On : November 1, 2022 / 1:40 PM IST

Vitamin Supplements : శరీరానికి కావాల్సిన పోషకాలు సహజంగా తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుల వంటి వాటి ద్వారా అందుతాయి. అయితే కొందరిలో పూర్తిగా పోషకాల లోపం ఏర్పడుతుంది. అలాంటి వారికి విటమిన్ సప్లిమెంట్స్ ను అందించటం ద్వారా లోపాన్ని నివారించాల్సి ఉంటుంది. అయితే విటమిన్ మాత్రలను తీసుకునే విషయంలో కొన్ని నియమాలను ఖచ్ఛితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

విటమిన్ మాత్రలు ఏసమయంలో తీసుకోవాలి ;

వివిధ రకాల విటమిన్ మాత్రలను రోజులో ఏప్పుడైనా వేసుకోవచ్చు. అయితే ఆహారంతోపాటు తీసుకుంటే శరీరరం వాటిని బాగా గ్రహిస్తుంది. అల్పాహారం తీసుకున్న తరువాత, భోజనం చేసిన తరువాత వీటిని తీసుకోవాలి. నీటిలో కరిగే విటమిన్ మాత్రలను రోజువారిగా ఆహారంతో పాటుగానే వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

అన్ని మాత్రలు కలిపి ఒకేసారి వేసుకుంటే ;

పెద్ద మొత్తంలో పోషకాలకు సంబంధించి మందులు వేసుకుంటే వాటిని శరీరం గ్రహించే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి వాటిని కలిపి ఒకేసారి వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. వీటిని ఆహారంతోపాటు తీసుకుంటే శరీరానికి వాటికి సంబంధించి పోషకాలు అందుతాయి. వాటిని ఒక దాని తరువాత భోజనం చేసిన తరువాత వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పోషకాల మాత్రలను వ్యాధినిరోధక మందులతో కలిపి మింగుతుంటే ;

చాలా మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారు దానికి సంబంధించిన మందులను మింగుతుంటారు. ఇలా మింగే సందర్భంలో వీటితో కలిపి పోషకాల మాత్రలను మింగటం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక మందులు వేసుకున్న గంట, నుండి రెండు గంటల సమయం తరువాత మాత్రమే విటమిన్ మాత్రలను వేసుకోవటం మంచిది.

గర్భధారణ సమయంలో విటమిన్ మాత్రలు మింగుతుంటే ;

గర్భదారణ సమయంలో చాలా మందికి విటమిన్ మాత్రలను వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. వాటిని వేసుకునే క్రమంలో తప్పకుండా గర్భిణీలు కొన్ని నియమాలను పాటించాలి. ఏదైన ఆహారం తీసుకున్న తరువాత మాత్రమే విటమిన్ మాత్రలను వేసుకోవాలి. అలాకాకుండా ఎలాంటి ఆహారం తీసుకోకుండా వేసుకుంటే వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి.