Kerala Noro : నోరో వైరస్ అంటే ఏమిటీ ? దీని లక్షణాలు ఏంటీ ?
వైరస్ సోకిన వ్యక్తులు వాంతులు చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.

Noro
Norovirus : అసలేంటి ఈ నోరో వైరస్, ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులకు ఎలా సోకుతుంది? దీని లక్షణాలు ఏంటి? ఎలా ఈ వైరస్‌ను కట్టడి చేయొచ్చు? అన్న దానిపై అవగాహన కల్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కేరళ ప్రభుత్వం. ఈ నోరా వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని.. ఈ వైరస్ బారినపడిన వారికి వాంతులు కావడం, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ ఉన్న ప్రాంతాలను తాకడం, అవే చేతులను నోటిలో పెట్టుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందంటున్నారు. ఇక వైరస్ సోకిన వ్యక్తులు వాంతులు చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు.
Read More : CM Jagan : నేడు తిరుమలకు సీఎం జగన్.. షాతో కలిసి శ్రీవారి దర్శనం
ఇక కేరళ రాష్ట్ర విషయానికి వస్తే… ఇండియాను టెర్రరైజ్ చేసిన కరోనా తొలి కేసు నమోదైంది కేరళలోనే.. అంతకుముందు నిపా.. ఆ తర్వాత జికా.. లెటెస్ట్ గా ఇప్పుడు నోరో వైరస్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. చాలా అరుదుగా కనిపించే నోరో వైరస్ వయనాడ్ జిల్లా పోకడ్‌లోని ఓ వెటర్నరీ కాలేజీ స్టూడెంట్స్‌కు సోకింది. ఏకంగా 13 మంది విద్యార్థులు దీని బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్ ఇప్పుడు కేరళ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. క్యాంపస్ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లోనే తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఈ వైరస్ ఒక్కసారి మనుషులకు సోకిందంటే చాలు… జాగ్రత్తపడకపోతే అత్యంత సులువుగా ఇతరులకు సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read More : Kurnool : కర్నూలు జిల్లాలో చర్చి పాస్టర్ అరాచకం
దీంతో ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. నోరో వైరస్‌ను కంట్రోల్ చేయడానికి ఈ వైరస్ సోకిన వారందరి డేటాను సేకరించడమే గాకుండా.. ఈ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కేరళ వైద్యశాఖ అధికారులు తెలిపారు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. పరిశుభ్రమైన తాగునీటితో పాటు, బాధితులకు తగిన సమయంలో చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.