CM Jagan : నేడు తిరుమలకు సీఎం జగన్.. షాతో కలిసి శ్రీవారి దర్శనం
సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి తిరుపతి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ స్వాగతం పలుకుతారు.

Cm Jagan
CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమల బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి తిరుపతి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు కలిసి తిరుమలకు వెళ్లి రాత్రి 9.30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.
చదవండి : CM Jagan: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి!
దర్శనం అనంతరం జగన్ తాడేపల్లి బయలుదేరుతారు. ఇక హోంమంత్రి తిరుపతిలోనే బసచేయనున్నారు. ఆదివారం కూడా జగన్ తిరుపతి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్లో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. అమిత్షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సమావేశం అనంతరం జగన్, అమిత్షా ప్రత్యేక విందులో పాల్గొననున్నారు.
చదవండి : CM Jagan: నేడు ఒడిశాకు సీఎం జగన్