CM Jagan : రైతులకు మంచి రోజులు.. ధాన్యం సేకరణపై సీఎం జగన్‌ సమీక్ష

ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్‌ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం..

CM Jagan : రైతులకు మంచి రోజులు.. ధాన్యం సేకరణపై సీఎం జగన్‌ సమీక్ష

Cm Jagan

CM Jagan : ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై మంత్రివర్గ ఉపసంఘంతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌, కొడాలి నాని, శ్రీరంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై పటిష్ట విధానం తీసుకురావాలన్నారు జగన్. ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్‌ వద్దే కొనుగోలు జరగాలన్నారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శక విధానం తీసుకురావాలన్నారు.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తొలగింపుపై చర్చించారు. రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు అని జగన్ చెప్పారు. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉండాలన్నారు. పేమెంట్స్‌లో తప్పిదాలు లేకుండా, మోసాలు లేకుండా, వేగంగా పేమెంట్లు చేయడానికి వీలుగా ఇ-క్రాప్‌ బుకింగ్, ఈ కేవైసీ తీసుకురానున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహన పెంచే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చెల్లింపులు జరగాలన్నారు.

”ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా పూర్తిగా మిల్లర్ల పాత్రను తీసేసాం. రైతుల ముంగిటే, ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదు. అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు. ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలి. ధాన్యం సేకరణలో రైతులకు మేలు చేసేలా కొత్త విధానంలోకి వెళ్తున్నాం. దీన్నొక సవాల్‌గా తీసుకుని, అన్ని రకాలుగా సిద్ధం కావాలి.

Sleep : వయస్సుకు తగ్గ నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందా?..

ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ ఇవ్వాలి. అలాగే ధాన్యం సేకరణపై వివరాలతో కూడిన బోర్డును ఆర్బీకేల్లో ఉంచాలి. మంచి ధర పొందడానికి తగిన సలహాలు, సూచనలు కూడా అందించేలా ఈ కరపత్రాలను రూపొందించాలి. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర అందాలి. దీనికోసం రైతులకు పరిజ్ఞానాన్ని పెంచేలా తగిన చర్యలు చేపట్టాలి” అని జగన్ అన్నారు.