Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

అనంతరం ఎముక కండరాల నుండి విడుదలయ్యే మయోకైన్స్ అనే ప్రొటీన్ల శాతాన్ని లెక్కించారు. వీటి ప్రభావం క్యాన్సర్ కణాలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు వ్యాయామాలకు ముందు...ఆతరువాత పరీక్షలు జరిపారు.

Exercise : క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం మంచిదేనా?..

Cancer

Exercise : ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో వ్యాధి క్యాన్సర్.. గత పదేళ్లలో క్యాన్సర్ కేసులు 28 శాతం పెరిగాయి. ఈ వ్యాధి వల్ల సంభవించే మరణాలు 20 శాతం పెరిగాయి. ‘మెడికల్ జర్నల్ ఆఫ్ ఆంకాలజీ’ 1990 నుంచి 2016 మధ్య చేసిన ఒక సర్వేలో వెల్లడించింది. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు అందరిలానే వ్యాయామాలు చేయాలా..వద్దా అనేదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియాకి చెందిన ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం నిపుణుల పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం చాలా మంచిదని పరిశోధనల్లో తేలింది. కండర బలాన్ని పెంచే ఏరోబిక్స్ వంటివి చేయటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గినట్లు వారు గుర్తించారు. వ్యాయమం వల్ల ట్యూమర్ కణాల సంఖ్య తగ్గటానికి కారణమయ్యే ప్రొటీన్ల శాతం పెరుగుతుందని పరిశోధనలో తేలింది. దీనికి గాను పదిమంది ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల్ని ఎంపిక చేసి వారికి చికిత్స కొనసాగిస్తూనే పన్నెండు వారాల పాటు వ్యాయామం చేయించారు.

అనంతరం ఎముక కండరాల నుండి విడుదలయ్యే మయోకైన్స్ అనే ప్రొటీన్ల శాతాన్ని లెక్కించారు. వీటి ప్రభావం క్యాన్సర్ కణాలపై ఎలా ఉందో తెలుసుకునేందుకు వ్యాయామాలకు ముందు…ఆతరువాత పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో వ్యాయామం తరువాత క్యాన్సర్ కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలా వుంటే మయోకైన్స్ నేరుగా క్యాన్సర్ కణాలను నాశనం చేయకుండా, రోగనిరోధక టి కణాలను ప్రేరణకు గురిచేయటం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనమయ్యేలా చేస్తున్నాయి. దీంతో క్యాన్సర్ రోగులు వ్యాయామాలు చేయటం వల్ల కొంత మేలు కలుగుతుందని గుర్తించినట్లైంది.