Yoga and Gym : యోగా , జిమ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

వ్యాయామాల విషయానికి వస్తే ఎక్సర్‌సైజ్ లు మంచి శరీరాకృతిని పెంపొందించటానికి సహాయపడతాయి. కానీ యోగాలో చేసే ఆసనాల వల్ల శరీరానికి మానసికంగా, శారీరకంగా మేలు కలుగుతుంది. ఎక్సర్‌సైజులు చేయాలంటే పరికరాలు అవసరంలేదు.

Yoga and Gym : యోగా , జిమ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

yoga and gym

Yoga and Gym : ఫిట్‌నెస్ అనేది జీవన విధానం. బరువు తగ్గడంలో వ్యాయామాలు సహాయడతాయి. ఆరోగ్యం కోసం చాలా మంది రోజువారిగా రకరకాల వ్యాయామాలు, కసరత్తులు చేస్తుంటారు. వారి వారి అభిరుచులకు తగ్గట్లుగా వివిధ వ్యాయామ పద్ధతుల్ని ఎంచుకుంటారు. కండరాల నిర్మాణం కోరుకునేవారు జిమ్ కి వెళ్తారు. బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవన విధానం కొనసాగించాలనుకునే వారు యోగా ను ఆచరిస్తారు. ఒత్తిడి తగ్గించుకోడానికి ఆసనాలు, ప్రాణాయామాలు అనుసరిస్తారు. అయితే యోగా మంచిదా, జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు

యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. యోగా చేస్తున్న సమయంలో శరీరాన్ని కదిలించటంతోపాటుగా, తెలియని విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఆసనాలు వేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జిమ్ వెళ్లడం, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారతాయి. యోగా వల్ల శరీర కదలికలు తేలికగా ఉంటాయి. శరీర బలం పెరుగటంతోపాటు శ్వాస మీద ధ్యాస పెట్టేందుకు యోగా సహాయపడుతుంది.

READ ALSO : Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో దంపతులను తొక్కి చంపిన ఏనుగు

వ్యాయామాల విషయానికి వస్తే ఎక్సర్‌సైజ్ లు మంచి శరీరాకృతిని పెంపొందించటానికి సహాయపడతాయి. కానీ యోగాలో చేసే ఆసనాల వల్ల శరీరానికి మానసికంగా, శారీరకంగా మేలు కలుగుతుంది. ఎక్సర్‌సైజులు చేయాలంటే పరికరాలు అవసరంలేదు. అయితే శారీరకబలం, కండరాల నిర్మాణానికి మాత్రం జిమ్ కు వెళ్లి తప్పకుండా కసరత్తులు చేయాల్సి ఉంటుంది.

READ ALSO : Telangana Congress: బీజేపీలోని ఐదుగురు ముఖ్యనేతలపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ!
యోగాకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది. యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు, మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటానికి తోడ్పడతాయి. ఆధ్యాత్మిక భావం సైతం పెరుగుతుంది. యోగా ఆలోచనలను నియంత్రించడానికి ,శ్వాస పద్ధతులను బోధిస్తుంది. ఇంద్రియాలు, భావోద్వేగాలపై నియంత్రణ సాధించడానికి యోగా తోడ్పడుతుంది. యోగా 5,000 సంవత్సరాల నుండి అనుసరిస్తున్నారు. యోగా 84 లక్షల భంగిమలు, 300 ప్రాణాయామ పద్ధతులు మరియు అనేక ధ్యాన వ్యాయామాలను అనుసరించవచ్చు.

READ ALSO : Chandrayaan 3: ఇస్రో సంచలనం.. జాబిల్లిపై ఉన్న మూలకాలను గుర్తించిన రోవర్

మొత్తానికి ఫిట్‌నెస్ కోసం యోగా, ఎక్సర్‌సైజ్ రెండూ మంచి పద్ధతులే. దేని లాభాలు దానికి ఉన్నాయి. మన అవసరాలను బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. లేదంటే రెండింటినీ అనుసరించవచ్చు.