Bread : వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఈరెండింటిలో పిల్లలు ఏది తినటం మంచిది?
ఫైబర్ ఎక్కువగా ఉన్నందున పదార్థాల జాబితాలో పేర్కొన్న 'హోల్ వీట్' ఉన్న బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోండి. ఎందుకంటే ఇందులో గోధుమ ధాన్యం పైన ఉండే ఊకతో కూడిన పిండితో తయారు చేస్తారు. అలాంటి గోధుమ పిండిలో ఉండే ఊక మనకు అధిక ఫైబర్‌ని అందిస్తుంది.

Which Is Bread Better (1)
Bread : ప్రపంచంలోని ఆరోగ్యకరమైన ఆహారాలలో బ్రౌన్ వర్ణం కలిగిన ఆహారాల్లో పోషకాలు అధికంగా ఉంటాయన్న ప్రచారం ఇటీవలి కాలంలో బాగా ఊపందుకుంది. దీనికి నిపుణులు సైతం మద్దతు పలుకుతుండటంతో అంతా బ్రౌన్ వైపు మొగ్గుచూపుతున్నారు. తెల్లటి అన్నానికి బదులు బ్రౌన్ రైస్ అన్నాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సాంప్రదాయ తెల్లని రొట్టెలకు బదులుగా బ్రౌన్ బ్రెడ్ లను ఆహారంగా ఎంపిక చేసుకుంటున్నారు.
పోషక విలువలకు సంబంధించి వైట్ బ్రెడ్ ఫైబర్‌తో సహా అన్ని పోషక లక్షణాలు తొలగించబడతాయి. తెల్ల రొట్టె తయారీలో, బెంజాయిల్ పెరాక్సైడ్, క్లోరిన్ డయాక్సైడ్ మరియు పొటాషియం బ్రోమేట్ వంటి రసాయనాలను ఉపయోగించి గోధుమ పిండి తెల్లగా రావటానికి బ్లీచ్ చేస్తారు. పిండి శుద్ధి చేసి స్టార్చ్ జోడిస్తారు. ఈ రసాయనాలన్నీ తక్కువ పరిమాణంలో ఉపయోగించబడుతున్నప్పటికీ, అవి ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఏమాత్రం మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. పరిగణించబడతాయి. వైట్ బ్రెడ్‌లో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌తో సహా అదనపు చక్కెరలు ఉంటాయి.
బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యకరమైనదేనా?
బ్రౌన్ బ్రెడ్ సాంప్రదాయ వైట్ బ్రెడ్ కంటే చాలా ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బ్రౌడ్ బ్రెడ్లలో కొంత మాయాజాలం చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు. మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్‌లో ఎక్కువ భాగం బ్రౌన్ కలరింగ్‌తో కూడిన వైట్ బ్రెడ్. నిజానికి, బ్రెడ్‌పై బ్రౌన్ కలర్ వచ్చేలా చేయటం వల్ల మీరు ఆరోగ్యకరమైన, మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ను తీసుకుంటున్నారని భావించి మోసపోతారు. అయితే అందరూ అలా మోసం చేయకపోవచ్చు. చాలా మంది తయారీదారులు అలా చేయకపోవచ్చు.
ఫైబర్ ఎక్కువగా ఉన్నందున పదార్థాల జాబితాలో పేర్కొన్న ‘హోల్ వీట్’ ఉన్న బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోండి. ఎందుకంటే ఇందులో గోధుమ ధాన్యం పైన ఉండే ఊకతో కూడిన పిండితో తయారు చేస్తారు. అలాంటి గోధుమ పిండిలో ఉండే ఊక మనకు అధిక ఫైబర్‌ని అందిస్తుంది. వీటిలో పీచు పదార్ధము, హోల్ వీట్ కలిగిన బ్రెడ్‌లో ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం మరియు జింక్ వంటి విటమిన్లు,ఖనిజలవణాలు అధికముగా ఉంటాయి. ఇందులో ప్లాంట్ లిగ్నన్స్ అనే ఫైటోన్యూట్రియెంట్ కూడా ఉంది, ఇది రొమ్ము క్యాన్సర్ మరియు గుండె జబ్బుల నుండి రక్షించడానికి తోడ్పడుతుంది.
పిల్లలకు హోల్ గ్రైన్ బ్రౌన్ బ్రెడ్ ఇవ్వడమే మంచిది. ఆరోగ్యంగా వంతమైన ఎదుగుదలకు బ్రౌన్ బ్రెడ్ బాగా సహాయపడుతుంది. వారిలో చురుకుదనాన్ని పెంచటానికి తోడ్పడుతుంది. బ్రెడ్ పేకెట్ల ను మార్కెట్లో కొనుగోలు చేసే ముందుగా పై గల తయారీపదార్ధాలు జాబితా చదివి ఎంచుకోవాలి. బ్రౌన్ గా కనిపించే బ్రెడ్ లన్ని హోల్-వీట్ కాకపోవచ్చని గుర్తుంచుకోవాలి.