వరల్డ్ వైడ్‌గా హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు.. సెలబ్రిటీలకు నచ్చే టాప్ డిష్‌లలో మన వంటకం
World Biryani Day 2024: హైదరాబాద్ బిర్యానీ అంటే టీమిండియా ప్లేయర్లకు కూడా ఎంత ఇష్టమో..

Chicken Biryani
పండ్లలో మామిడి రారాజు. ఆహారంలో ఆహా అనిపించే వంటకం బిర్యానీ. దేశంలో ఎక్కువ మంది తింటోన్న ఫుడ్ కూడా బిర్యానీయే. ఓ రకంగా భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్‌గా మారింది. ఏదైనా పనిమీద ఊరు నుంచి హైదరాబాద్‌కు వస్తే.. ఇతర రాష్ట్రాలు, బయటి దేశాల నుంచి మన సిటీకి వచ్చినోళ్లు అయినా.. హైదరావాద్ ధమ్ బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే. ఇగ హైదరాబాద్‌లో ఉండే వాళ్లైతే రెండుమూడ్రోజులకు ఓసారి ఏదో ఓ హోటళ్ల బిర్యానీ తినుడు కామన్. అంత ఫేమసైన మన హైదరాబాద్ బీర్యానికి దునియానే ఫిదా అవుతోంది.. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫుడ్‌లలో బిర్యానీకి ఆరో ర్యాంకు దక్కింది.
హైదరావాద్ బిర్యానీ అంటే ఇష్టపడనోళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే బిర్యానీ అనే మాటొస్తే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏదో ఒక హోటల్‌కు వెళ్లి బిర్యానీ లాగిస్తే తప్ప మనసు రిలాక్స్ కాదు. అందుకు కారణం ఒక్కటే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్. మనుసును మైమరిపించే రుచి, ఆహా అంటూ ఆస్వాదించే వాసన.. తృప్తి నుంచే ఫుడ్‌గా బిర్యానీని ఇష్టపడి తినని వారుండరు.
అందరూ ఫిదా
ధోని నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే కోహ్లీ వరకు.. రాహుల్‌గాంధీ నుంచి అమెరికా అగ్రనేతల వరకు.. హైదరాబాద్ బిర్యానీ అంటే అందరూ ఫిదా అవుతారు. ఎంతపెద్ద సెలబ్రిటీ అయినా మీకు కిష్టమైన ఫుడ్ ఏంటని అని అడిగితే టక్కున హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేస్తారు. మాటల్లోనే కాదు ఎప్పుడైన మన నగరానికి వస్తే బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ దునియాలోనే రారాజుగా నిలుస్తూ వస్తోంది. చిన్న పిల్లాడి నుంచి పండుముసలి వరకు అందరినీ ఫిదా చేస్తుంది మన హైదరాబాదీ బిర్యానీ.
హైదరాబాద్ బిర్యానీ కథ ఇప్పటిది కాదు. నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ బిర్యానీకి పెద్ద కహానినే ఉంది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టిందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. బిరింజ్ అంటే రైస్ అని అర్థమట. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే తెగ ఇష్టపడేవారట. మొఘలుల కాలంలో యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం బిర్యానీ వండి పెట్టేవారని చెప్తుంటారు. అప్పటి నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ బిర్యానీ ట్రెండింగ్‌లో ఉంటూనే వస్తోంది.
సిటీలో ఏ మూలకెళ్ళినా..
ఒకప్పుడు బిర్యానీ అంటే ఓల్డ్ సిటీ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు సిటీలో ఏ మూలకెళ్ళినా బిర్యానీ దొరకడం ఈజీ అయిపోయింది. రోజురోజుకు బిర్యానీకి పెరుగుతోన్న డిమాండ్‌తో కొత్త కొత్త రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. అయినా ఏళ్ల నాటి నుంచి చార్మినార్ దగ్గరలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్.
పాతబస్తీలోని దారుల్ షిఫాలోని నయాబ్, హైదర్‌గూడలోని కేఫ్ బహార్, సికింద్రాబాద్‌లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్‌ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని అదా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్.. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా.. ట్రెండ్‌కు తగ్గట్లుగా ఇప్పుడు మరికొన్ని రెస్టారెంట్స్ టెస్టీ బిర్యానీలను వడ్డిస్తున్నాయి.
హైదరాబాదీ బిర్యానీ అంటే హైదరాబాద్‌లోనే ఫేమస్ కాదు. మొత్తం దునియాలో టెస్టీ ఫుడ్. అందుకే వరల్డ్‌వైడ్‌గా చెప్పుకోదగ్గర వంటకాల్లో ఆరో స్థానం దక్కించుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చే గెస్టులు, టూరిస్టులు, స్పోర్ట్స్ ప్లేయర్లు ఎవరికైనా హైదరాబాద్ బిర్యానీ తింటే నాలుక నాట్యం ఆడాల్సిందే. 2019 డిసెంబర్‌లో ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఓ మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ వచ్చింది భారత్ టీమ్. బయటి నుంచి తెప్పించుకున్న బిర్యానీని అలో చేయకపోవడంతో ఏకంగా స్టే చేస్తున్న హోటల్‌ను ఖాళీ చేసి.. మరో హోటల్‌కు వెళ్లిపోయారు టీమిండియా ప్లేయర్లు. అంటే హైదరాబాద్ బిర్యానీ అంటే టీమిండియా ప్లేయర్లకు కూడా ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
కేవ్ పబ్ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు