కేవ్ పబ్‌ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కేవ్ పబ్‌ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

The Cave Pub Drugs Case : హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారి పేర్లను పోలీసులు విడుదల చేశారు. పట్టుబడిన వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేశ్ చంద్ర, మ్యూజీషియన్ అబ్దుల్లా అయూబ్, యానిమేటర్ చింతం పూజిత్, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతురి వంశీకృష్ణ పట్టుబడినట్లుగా పోలీసులు వెల్లడించారు. అలాగే అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎవరెస్ట్ మసాల వ్యాపారవేత్త మహేశ్ గిరిధర్ తో పాటుతో మరికొందరు బిజినెస్ మ్యాన్లు షఫీ, రఝా సైతం డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. అలాగే ప్రముఖ అకౌంటెంట్లు ఆదన్ బారి, నవాజుద్దీన్, సివిల్ ఇంజినీర్ రోహిత్ వర్మతో పాటు మరో కాలేజీ విద్యార్థి పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు.

కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి పేర్లు విడుదల..
* కేవ్ పబ్బులో పట్టుబడిన వారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు
* ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేశ్ చంద్ర
* ప్రముఖ అకౌంటెంట్ ఆదన్ బారి
* అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండీ షఫీ
* అమెజాన్ ఉద్యోగి కిరణ్ బాగాని
* ఎవరెస్ట్ మసాల వ్యాపారవేత్త మనీశ్ గిరిధర్
* యానిమేటర్ చింతం పూజిత్
* మ్యూజిషియన్ అబ్దుల్లా అయూబ్
* వ్యాపారవేత్తలు మహ్మద్ రఫీ, ఎండీ రఝా
* అవంతి డిగ్రీ కాలేజీ విద్యార్థి సాయిప్రణీత్
* సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిరణ్ కుమార్
* టీసీఎస్ ఉద్యోగి నారేడుమల్లి సందీప్
* జీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతూరి వంశీకృష్ణ
* డీజే ఆపరేటర్ సందీప్ శర్మ, గౌరంగ్, మధుసూదన్, నవాజుద్దీన్, రోహిత్ వర్మ
* 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు

విచారణ తర్వాత పబ్ మూసివేత- మాదాపూర్ డీసీపీ వినీత్
హైదరాబాద్ లో సంచలనం రేపిన కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన వారిలో ప్రముఖులు ఉన్నారు. వారి పేర్లను పోలీసులు వెల్లడించారు. మొత్తం 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామని డీసీపీ వినీత్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్ డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ది కేవ్ పబ్ మేనేజర్ ఆర్ శేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విచారణ అనంతరం పబ్ ను మూసివేస్తామన్నారు.

త్వరలో పబ్ యజమానులను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పబ్ ఓనర్లను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందన్నారు. డ్రగ్స్ పై ఉద్యోగులకు ఆయా కంపెనీలు అవగాహన కల్పించాలని డీసీపీ వినీత్ సూచించారు. దాంతో పాటు ఐటీ కంపెనీలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. పట్టుబడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

Also Read : పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ..! ఏకంగా 50మందిని పెళ్లి చేసుకుంది, చివరికి ఆధార్ కార్డుతో అడ్డంగా దొరికిపోయింది..