Yogurt : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు!

వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని పెరుగు తీసుకోవటం ద్వారా పొందవచ్చు.

Yogurt : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు!

Yogurt

Updated On : April 24, 2022 / 10:57 AM IST

Yogurt : వేసవి కాలంలో ఎండల తీవ్రతను తట్టుకోవడానికి రకరకాల పానీయాలు, ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. అయితే వాటిలో పెరుగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శరీరంలో ఉండే వేడి తగ్గి శరీరం చల్లబడడానికి పెరుగును, పెరుగుతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది పెరుగుతో ఎక్కువగా మజ్జిగ, లస్సీలను తయారు చేసుకుని సేవిస్తుంటారు. కూరన్నం తిన్నాక ఆఖరి ముద్దైనా పెరుగును కలుపుకుని తినటం చాలా మందికి అలవాటు. ఇది అలవాటే అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పెరుగును రోజు వారిగా తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అయితే పెరుగుతో పెరుగన్నం తయారు చేసుకుని తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించేస్తుంది. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గానే కాక.. మధ్యాహ్నం లంచ్‌గా కూడా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపాన్ని తగ్గించటంలో పెరుగు ఎంతగానో దోహదపడుతంది. పెరుగు శరీరానికి రక్షణ కవచంలా పనిచేయటంతోపాటు మెదడు పనితీరును చురుకుగా ఉంచేందుకు ఉపకరిస్తుంది. పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచిది.

పెరుగు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. జీర్ణక్రియకు తోడ్పడే ప్రొబయోటిక్ బ్యాక్టీరియా పెరుగులో అధికంగా ఉండటం వల్ల పేగులకు ఆరోగ్యాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో సైతం ఉపకరిస్తుంది. డయేరియా వంటి సమస్యలు ఎదురైన సందర్భంలో పెరుగుతో మజ్జిగ చేసుకుని తాగటం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను దూరం చేయటంతోపాటు, మహిళల్లో వెజనైల్ ఇన్ ఫెక్షన్స్ తగ్గించటంలో పెరుగు ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే మాంసకృత్తులు నాడులను మరమ్మత్తు చేయటంతో పాటు ధృఢంగా మారుస్తాయి. పెరుగులో చక్కెరకు బదులు తేనె కలిపి తీసుకుంటే అల్సర్ తగ్గుతుంది.

వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని పెరుగు తీసుకోవటం ద్వారా పొందవచ్చు. పెరుగులో ఉండే లినోలిక్ ఆమ్లం రోగనిరోధకతను పెంచి ఇన్ ఫెక్షన్లు, అలర్జీలను దరి చేరకుండా చూస్తాయి. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. చర్మంపై ముడతల ను నిరోధించటంతోపాటు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా ఉపకరిస్తుంది. మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమంగా చెప్పవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది.