Hardik Pandya meets Amit Shah: సోదరుడు కృనాల్‌తో కలిసి అమిత్ షాను కలిసిన హార్దిక్ పాండ్యా
‘‘మీతో ఈ అమూల్యమైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించిన హోం మంత్రి అమిత్ షాజీకి కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవప్రదంగా భావిస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమిత్ షాతో తీసుకున్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశాడు.

Hardik Pandya meets Amit Shah
Hardik Pandya meets Amit Shah: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశాడు. భారత్-శ్రీలంక మధ్య జనవరి 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అలాగే, కొన్ని గంటల్లో భారత్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా అమిత్ షాను కలిశారు.
‘‘మీతో ఈ అమూల్యమైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించిన హోం మంత్రి అమిత్ షాజీకి కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవప్రదంగా భావిస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అమిత్ షాతో తీసుకున్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశాడు.
కాగా, శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అనంతరం జరిగే వన్డే సిరీస్ లో అతడు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ గత ఐపీఎల్ సీజన్ లో కప్ గెలిచిన విషయం తెలిసిందే.
టీమిండియా టీ20 స్వాడ్ లో… హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివరాం మావి, ముకేశ్ కుమార్ ఉన్నారు.
View this post on Instagram