Telangana Polling : గతంతో పోలిస్తే తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి ప్లస్ కానుంది?

ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు.

Telangana Polling : గతంతో పోలిస్తే తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి ప్లస్ కానుంది?

Telangana Polling : తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ శాతం 70 దాటనుంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం 75 పర్సెంటేజ్ దాటింది. ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది. ఈసారి 75శాతం ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. కాగా.. తెలంగాణలో సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

తెలంగాణలో సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఇంకా చాలా మంది క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. పోలింగ్ సమయం అయిపోయినా అప్పటికే క్యూలైన్ లో ఉన్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. రాత్రి ఏడు గంటల తర్వాతే తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసే అవకాశం ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62.77 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కచ్చితంగా దాన్ని క్రాస్ చేసినట్లు అని చెప్పొచ్చు. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు.

ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు. పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చారు. ఎక్కడ చూసినా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపించింది. భువనగిరి, జహీరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ ప్రాంతాల్లో 75శాతానికి పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది.

Also Read : ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం.. కేసీఆర్‌ను కేఏ పాల్‌తో పోల్చిన సీఎం రేవంత్