ఎన్నికల వేళ మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్న ప్రధాన ఇష్యూ ఇదే..

ఈడీ, సీబీఐ కేసులు.. విపక్షాలు ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలున్నచోట, మోదీని ప్రశ్నించే నాయకులపై అక్రమ..

ఎన్నికల వేళ మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్న ప్రధాన ఇష్యూ ఇదే..

Modi

మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్న ప్రధాన ఇష్యూ నిరుద్యోగం. గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. ఇక ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ఈడీ, సీబీఐ కేసులు కూడా కీలకం కానున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలపై కేసుల అంశం ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది.

నిరుద్యోగ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ. భారత్ న్యాయ్ యాత్రలో పూర్తిగా ఉద్యోగాలు, రిజర్వేషన్లపైనే కాన్సన్‌ట్రేట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకపోగా.. ప్రైవేటు సెక్టార్‌ను మోదీ ప్రభుత్వం ఆగం చేసిందని.. ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం విషయంలో భారత్ టాప్ లో ఉందని గళమెత్తుతున్నాయి విపక్షాలు.

అయితే అధికార పార్టీ వెర్షన్‌ మరోలా ఉంది.. రైల్వే, డిఫెన్స్, నేవీ, బ్యాంకింగ్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ జరిగిందని చెప్తోంది బీజేపీ. స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పుకొస్తోంది.

ఎవరి వెర్షన్‌ ఎలా ఉన్నా ఈ సార్వత్రిక ఎన్నికల్లో సౌత్‌లో సంక్షేమ పథకాలు.. నార్త్‌లో సెంటిమెంట్‌ పాలిటిక్స్‌ పార్టీల గెలుపోటములను నిర్ణయించే కీ ఫ్యాక్టర్స్‌గా మారనున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉచితాలు గేమ్‌ ఛేంజర్స్‌ కానుండటంతో కాంగ్రెస్‌ అదే ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తోంది.

మోదీ గ్యారంటీ
మరోవైపు మోదీ మాత్రం మీ భవిష్యత్‌కు నాది గ్యారెంటీ అంటున్నారు. ఆ ఒక్క నినాదంతోనే కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలను ఢీకొంటున్నారు ప్రధాని.. సంక్షేమం అవసరమే కావచ్చు కానీ.. దేశవ్యాప్తంగా గెలుపోటములను ఉచితాలే ప్రభావితం చేయవని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

ఇక స్థిరమైన ప్రభుత్వ పాలన అందించడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయింది. కరోనా లాంటి ప్యాండమిక్ టైమ్‌లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసే అవకాశం దొరికింది. యూపీఏ హయాంలో సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల హవా నడిచేది. బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే అంతర్జాతీయ అంశాలను డీల్ చేసే విషయంలో కానీ.. పొరుగు దేశాలతో గొడవ విషయంలో కానీ స్పష్టమైన వైఖరితో ముందుకుపోగలిగింది మోదీ సర్కార్.

ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెస్తుంది. బలమైన ప్రభుత్వం.. పటిష్టమైన భారత్ అని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. అంతర్గత రాజకీయ గొడవలుంటే అభివృద్ధి కుంటుపడుతుందని.. మోదీ గ్యారెంటీకి ఓటేస్తే.. భవిష్యత్ బాగుంటుందని భరోసా ఇస్తుంది బీజేపీ. ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది ఇండియా కూటమి. ఇన్నాళ్లు మోదీ చేసిందేమి లేదని.. పదేళ్ల కాలంలో విపక్ష ప్రభుత్వాలను కూల్చడం తప్ప.. దేశ అభివృద్ధికి ఉపయోపడే నిర్ణయాలేమి తీసుకోలేదని అంటున్నాయి అపోజిషన్ పార్టీలు.

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు
ఈడీ, సీబీఐ కేసులు.. విపక్షాలు ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలున్నచోట, మోదీని ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనేది ఇండియా కూటమి ఆరోపణ. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్, మహారాష్ట్రలో సంజయ్ రౌత్, ఆప్ చీఫ్‌ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలను.. ప్రజల్లో తక్కువ చేసే చూపేందుకు బీజేపీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపిస్తున్నాయి.

అయితే అవినీతి లేకుండా చేయడమే మోదీ ప్రధాన ఎజెండా అని బీజేపీ చెప్పుకొస్తోంది. తప్పుచేసినోళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనంటున్నారు కమలనాథులు. అయితే బీజేపీలో చేరిన నేతలపై చర్యలేవి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈడీ, సీబీఐ రైడ్స్ అంశాన్ని కూడా ఇండియా కూటమి ప్రధాన అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.

పది అంశాలే కాకుండా చాలా అంశాలు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులు, ఇతరత్ర అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. ప్రాంతీయ పార్టీల నేతలు పటిష్టంగా ఉన్నచోట్ల ఒకలా.. బీజేపీ ప్రభావం రాష్ట్రాల్లో మరోలా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ ఎన్నికలకు మోదీ ఫేస్‌గా ఎదుర్కోవడానికి బీజేపీ రెడీ అయింది. ఇండియా కూటమి మాత్రం ప్రధాని క్యాండిడేట్‌పై స్పష్టత లేకుండానే..మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి రావాలనుకుంటోంది.

Devineni Uma Maheswara Rao : టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి?