Unstoppable episode 5 : అన్‌స్టాపబుల్ వేదికపై తారక రాముడి శతజయంతి వేడుకలు..

తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. తాజాగా ఐదో ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. కాగా ఈ ఎపిసోడ్ లో తారక రాముడి శతజయంతి వేడుకలు నిర్వహించాడు బాలకృష్ణ.

Unstoppable episode 5 : అన్‌స్టాపబుల్ వేదికపై తారక రాముడి శతజయంతి వేడుకలు..

100 years of NTR celebrations at Unstoppable show

Updated On : December 1, 2022 / 4:54 PM IST

Unstoppable episode 5 : తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. నిక్కర్చిగా మాట్లాడే బాలకృష్ణని ఈ షోకి వ్యాఖ్యాతగా పెట్టి.. చంద్రబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు వంటి ఎంతోమంది సినీరాజకీయ నాయకుల జీవితాల్లో దాగున్న పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తుండడంతో, అన్‌స్టాపబుల్‌ షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది.

Unstoppable episode 5 : ఇండస్ట్రీని అదుపులో పెట్టుకున్న ఆ నలుగురు నిర్మాతల్లో.. ఇద్దరు మీరే కదా?

కాగా ఐదో ఎపిసోడ్ కి టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబులను తీసుకువచ్చి, ఇండస్ట్రీలోని పలు విషయాలను గురించి ప్రశ్నించాడు బాలకృష్ణ. ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. అలాగే ఈ ఎపిసోడ్ లో యుగపురుషుడు స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’ శతజయంతి వేడుకలను నిర్వహించాడు బాలకృష్ణ.

1923లో జన్మించిన ఎన్టీఆర్.. ఈ ఏడాదితో 100 ఏళ్ళు పూర్తీ చేసుకున్నాడు. దీంతో అయన తనయుడు బాలకృష్ణ.. “నాకు ధన్యమైన జన్మనిచ్చినందుకు – నా కన్నతండ్రి, నా గురువు, నా దైవం అయిన ఆ కారణజన్ముడికి శతజయంతి వందనాలు” అంటూ అన్‌స్టాపబుల్ వేదికపై తారక రాముడిని స్మరించుకుంటూ ట్రిబ్యూట్ ని అందించాడు. ఇక ఈ ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుంది.