Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరగదీస్తున్నాడు..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు..

Vijay Deverakonda
Vijay Deverakonda: సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ స్టార్స్‌కి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. రీసెంట్‌గా రౌడీ స్టార్, ‘లైగర్’ తో పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విజయ్‌ని అక్షరాలా 14 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ కావడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం #14MRowdiesOnInsta అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు విజయ్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. సౌత్ నుండి ఫస్ట్ హీరో..