Tovino Thomas : రాజమౌళి ప్రతి ఫిలిం మేకర్‌కి స్ఫూర్తి.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్!
2018 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ రాజమౌళి గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజమౌళి వేసిన అడుగులు వెనకే..

2018 movie fame Tovino Thomas comments on rajamouli
Tovino Thomas : మలయాళ సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ‘టోవినో థామస్’ గట్టిగా వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ స్టార్ట్ చేసిన టోవినో.. విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్ చేసి నేడు మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకడు అయ్యాడు. మన తెలుగు వాళ్ళకి సూపర్ హీరో కథాంశంతో వచ్చిన ‘మిన్నల్ మురళి’ మూవీతో ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. తాజాగా ఈ హీరో 2018 అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్!
దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకొని మొన్నటి వరకు ఇండస్ట్రీ హిట్టుగా ఉన్న మోహన్ లాల్ ‘మన్యం పులి’ మూవీ రికార్డుని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక ఈ చిత్రం ఇంతటి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు రిలీజ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ ఈవెంట్ కి టోవినో హాజరయ్యాడు.
The Kerala Story : హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన కేరళ స్టోరీ డైరెక్టర్.. ఏమైంది?
ఈ కార్యక్రమంలో టోవినో మాట్లాడుతూ.. “రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి వలన సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా అనే పదం వచ్చింది. ఆ తరువాత ఆయన డైరెక్ట్ చేసిన RRR చిత్రం ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. ఆ సినిమా గ్లోబల్ మార్కెట్ కి దారి వేసింది. రాజమౌళి తన సినిమాని చూపించే విధానం, ఆ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకువెళ్లే విధానం ప్రతి ఫిలిం మేకర్‌కి స్ఫూర్తి. ఇండియాలోని ప్రతి ఫిలిం మేకర్ ఆయన అడుగులు వెనకే నేడు ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ సినిమాలను తీసుకు వెళ్తున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు.